జాతీయ వార్తలు

పద్ధతులు పాటించకుండా ట్రిపుల్ తలాక్ చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయిని, ఏప్రిల్ 23: ముస్లిం మతానికి చెందిన తౌసిఫ్ షేక్ అనే వ్యక్తి తన భార్య అర్షీఖాన్‌కు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం చెల్లదని ఉజ్జయిని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తౌఫిక్ ముస్లిం మత సాంప్రదాయాలను పాటించకుండా విడాకులు ఇవ్వడం అక్రమమని, కనుక ఇది చెల్లబోదని అడిషనల్ ప్రిన్సిపల్ జడ్జి ఓంప్రకాష్ శర్మ గత నెల 9న తేల్చిచెప్పారు. బాధితురాలి తరఫు న్యాయవాది కథనం ప్రకారం.. దేవాస్‌కు చెందిన తౌసిఫ్‌ను 2013 జనవరి 19న అర్షీ ఖాన్ పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత తౌసిఫ్ డబ్బు కోసం అర్షీ ఖాన్‌ను వేధించడంతో పుట్టింటికి చేరుకున్న ఆమె తన భర్తపై వరకట్న వ్యతిరేక చట్టం కింద కేసు దాఖలు చేసింది. 2014 అక్టోబర్ 9వ తేదీన ఉజ్జయిని కోర్టు ఆవరణలోనే అర్షీ ఖాన్‌కు వౌఖికంగా మూడుసార్లు తలాక్ చెప్పిన తౌసిఫ్ ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చినట్లు నోటీసు ద్వారా తెలియజేశాడు. ఈ వ్యవహారంలో అతను ముస్లిం మత సాంప్రదాయాలను, నిబంధనలను పాటించలేదన్న కారణంతో అర్షీ ఖాన్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో తౌసిఫ్ షేక్ ఈవిధంగా విడాకులు ఇవ్వడం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.