జాతీయ వార్తలు

ఉన్నత విద్యాసంస్థల్లో ఇక హిందీలోనే బోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి హిందీ బోధన పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పార్లమెంట్ పానెల్ సిఫార్సులను అమలుచేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. హిందీ విభాగం లేని యూనివర్శిటీల్లో ఆ విభాగం ఏర్పాటు చేస్తారు. హిందీయేతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో హిందీ తప్పనిసరి చేసినా పరీక్షల్లో మాత్రం జవాబులను తమ మాతృభాషల్లో రాసే అవకాశాన్ని కల్పిస్తారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు, సంస్థలు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నాయి. విద్యారంగానికి స్వయంప్రతిపత్తి కల్పించటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలను రూపొందించాయి. వీటి పరిధిలో కొన్ని వర్శిటీలు, విద్యాసంస్థలు ఇంగ్లీష్‌నే మాధ్యమంగా బోధన చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని అమలు చేయటంలో భాగంగా అన్ని విద్యాసంస్థలు, యూనివర్శిటీల్లో హిందీ తప్పనిసరి చేస్తూ ఒక ఉమ్మడి చట్టాన్ని అమలు చేసేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. హిందీ మీడియంను ప్రోత్సహించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్‌ఆర్‌డి వర్గాలు పేర్కొన్నాయి.