జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మళ్లీ ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 24: కాశ్మీర్‌లో ఐదు రోజుల విరామం తరువాత సోమవారం విద్యా సంస్థలు తెరుచుకున్న సందర్భంలో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. విద్యార్థులు భద్రతాదళాలపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు. శ్రీనగర్‌లోని ఎస్‌పి కాలేజీ నుంచి ఎంఏ రోడ్డులో విమెన్స్ కాలేజీ వరకూ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులతో విద్యార్థులు ఘర్షణకు దిగి, రాళ్లవర్షం కురిపించారని అధికారులు వెల్లడించారు. తొలుత ఎస్‌పి కాలేజీ వద్ద మొదలైన ఘర్షణలు రీగల్ చౌక్, పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. మిమెన్స్ కాలేజీ విద్యార్థినులు నిరసనల్లో పాల్గొన్నారు. విద్యార్థులు పెద్దఎత్తున రోడ్లపైకి రావడంతో కమర్షియల్ హబ్, పరిసన ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించారు. తాజా ఘర్షణలతో వ్యాపార సంస్థలు మూసేశారు. ఐదు రోజుల తరువాత విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కాశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముందుస్తు జాగ్రత్తల్లో భాగంగా ఉన్నత విద్యా సంస్థలు మూసేయాలని నిర్ణయించారు.
పిడిపి నేత హత్య
పుల్వామా జిల్లా పిడిపి అధ్యక్షుడు అబ్దుల్ గనీ డర్‌ను మిలిటెంట్లు కాల్చి చంపారు. పింగ్లెనా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అబ్దుల్‌పై అతి దగ్గర నుంచి మూడుసార్లు కాల్పులు జరిపారని వారన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. అబ్దుల్ చాతిలోకి రెండు బుల్లెట్లు, ఒకటి భుజంలోకి దిగాయి. దక్షిణ కాశ్మీర్‌లో ఈ వారంలో జరిగిన రెండో రాజకీయ నాయకుడి హత్య. ఈ నెల 17న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను షోపియాన్‌లో మిలిటెంట్లు కాల్చి చంపారు.

చిత్రం... శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతున్న బాలికలు. జవాన్లు బాష్పవాయువు ప్రయోగించడంతో పారిపోతున్న దృశ్యం