జాతీయ వార్తలు

పట్టాలెక్కనున్న ఏసి డబుల్ డెక్కర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలో అత్యంత రద్దీగా ఉండే రూట్లలో డబుల్ డెక్కర్ ఏసి రైళ్లను నడపనున్నారు. న్యూఢిల్లీ-లక్నో మార్గంలో జూలైనుంచి ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఏసి చైర్‌కార్‌తో రాత్రిళ్లు రైలు నడపనున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అయితే డబుల్ డెక్కర్ ఏసి రైలులో స్లీపర్ బెర్తులు ఉండవు. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే సెమీస్లీపర్ సీట్లు ఉంటాయి. ఒక్కో బోగీలో 120 మంది ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు వేడివేడి ఆహార పదార్థాలు సరఫరా చేస్తారని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ, లక్నో తదితర మార్గాల్లో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రవేశపెడుతున్నామని, చార్జీలు కూడా మిగతా ఎక్స్‌ప్రెస్‌లలో 3ఏసి కంటే తక్కువగానే ఉంటాయని వారన్నారు. 3ఏసి బోగీ కంటే మెరుగైన సదుపాయాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి కోచ్‌లోనూ ఓ ఎల్‌ఇడి టీవీ ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు వైఫై కనెక్షన్ ద్వారా హెడ్‌ఫోన్‌లను వాడుకోవచ్చు. సీట్లలో కూర్చునే టీవీ కార్యక్రమాలు వీక్షించడంతోపాటు హెడ్‌ఫోన్లద్వారా సౌండ్ వినవచ్చని అధికారులు చెప్పారు. రాత్రివేళల్లో స్లీపర్ బెర్త్‌లు లేకుండా ప్రయాణం ఏలా అని ఆందోళన చెందనక్కర్లేదని వారన్నారు. కాళ్లు చాపుకోడానికి వీలైనంత ఖాళీగా సీట్లు ఉంటాయని, ఆధునిక శైలికి అద్దంపట్టేలా లోపల అన్ని హంగులూ ఏర్పాటుచేస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. అన్ని బోగీల్లోనూ బయో టాయిలెట్లు ఉంటాయి. కాగా 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ప్రవేశపెడుతున్న ఈ డబుల్ డెక్కర్ ఏసి చైర్‌కార్ రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.