జాతీయ వార్తలు
విచారణకు హాజరుకండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. ఆయనతో పాటు ఆయన సహచరులకు కూడా సమన్లు పంపింది. విచారణ నిమిత్తం డిసెంబర్ మొదటి వారంలో తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీచేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆయన సహచరులకు కూడా ఇదే రకమైన ఆదేశాలు అందాయని పేర్కొన్నాయి. 2009-11 మధ్య వీరభద్రసింగ్ కేంద్రమంత్రిగా ఉన్న 6.1 కోట్ల రూపాయలను కుటుంబ సభ్యుల పేర ఎల్‌ఐసి పాలసీలు తీసుకున్న కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతోంది. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఆధారాలను సిబిఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గత ఇడి బృందాలు సోదాలు జరిపాయి. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగానే వీరభద్రసింగ్, ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో ఇడి విస్తృతంగా సోదాలు నిర్వహించింది.