జాతీయ వార్తలు

శశికళ వర్గాన్ని దూరంగా ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఎఐఎడిఎంకె కార్యాలయాన్ని ఉపయోగించుకోకుండా వికె.శశికళ వర్గాన్ని నిలువరించాలని కోరుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపిఎస్) వర్గం శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఇసి)ను ఆశ్రయించింది. అంతేకాకుండా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళకు పదోన్నతి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ వర్గం తాజాగా కొన్ని పత్రాలను ఇసికి సమర్పించిందని ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న దానిపై తమ రెండు వర్గాల మధ్య పరిష్కారం కుదిరే వరకూ ఎఐఎడిఎంకె అధికార పత్రిక ‘డా.నమదు ఎంజిఆర్’ను శశికళ ఆధీనంలో ఉంచరాదని పన్నీర్‌సెల్వం వర్గీయులు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఆర్‌కె.నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎఐఎడిఎంకె పేరును గానీ, పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘రెండు ఆకుల’ గుర్తును గానీ ఉపయోగించడానికి వీల్లేదని ఈ రెండు వర్గాలకు స్పష్టం చేస్తూ ఎన్నికల కమిషన్ మార్చి 23వ తేదీన తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఈ నియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో డబ్బును ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఉప ఎన్నిక రద్దయిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఎన్నిక జరిగే తేదీని ఇసి ప్రకటించాల్సి ఉంది.

శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తమిళనాడు మాజీ సిఎం పన్నీర్‌సెల్వం బృందం

కేజ్రీవాల్‌కు హవాలా సంబంధాలు

అందుకే నోట్ల రద్దును వ్యతిరేకించారు ఢిల్లీ సిఎంపై నిప్పులు చెరిగిన కపిల్ మిశ్రా
న్యూఢిల్లీ, మే 19: ఢిల్లీలో మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హవాలా ఆపరేటర్లతో కేజ్రీవాల్‌కు సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించారని కపిల్ మిశ్రా నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఢిల్లీలో రోహిత్ టాండన్ అనే న్యాయవాదికి చెందిన సంస్థ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జప్తు చేసిందని, ఆ సంస్థ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ముడుపులు అందాయని కపిల్ మిశ్రా ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన (కేజ్రీవాల్) బలవంతంగా ఎందుకు వ్యతిరేకించారు?, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన దేశమంతటా ఎందుకు ప్రచారం నిర్వహించారు?, ఎందుకంటే.. నల్లధనాన్ని కూడబెట్టిన కేజ్రీవాల్ మనుషులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దాడులు నిర్వహించడం వల్లనే ఆయన ఈవిధంగా వ్యవహరించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ కాలర్ నా చేతిలో ఉంది. ఆయన తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం’ అని కపిల్ మిశ్రా అన్నారు. కాలర్ పట్టుకుని కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు ఈడ్చుకెళ్తానని కపిల్ మిశ్రా ఇంతకుముందు విలేఖరుల సమావేశంలో హెచ్చరించిన విషయం విదితమే.
అయితే కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ తోసిపుచ్చారు. కపిల్ మిశ్రా చెబుతున్న 2 కోట్ల రూపాయల విరాళాలు 2014 ఏప్రిల్ 5వ తేదీన తమ పార్టీకి వచ్చాయని, ఇవన్నీ సరైన బ్యాంకింగ్ మార్గాల్లోనే వచ్చాయని, ఈ విరాళాల విషయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.