ఆంధ్రప్రదేశ్‌

మీరు మారకుంటే.. మేమే మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 20: ట్రిపుల్ తలాఖ్ దురాచారాన్ని మార్చడంలో ముస్లిం సమాజం విఫలమైన పక్షంలో కేంద్రమే రంగంలోకి దిగి చట్టం చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి ఆవాస మండలి చైర్మన్‌గా ఎన్నికయిన సందర్భంగా వెంకయ్యను పలు సంఘాలు శనివారం ఇక్కడ ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ ‘ట్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించాల్సింది సమాజమే. ముస్లిం సమాజం ఈ దురాచారాన్ని మారిస్తే మంచిదే. లేనిపక్షంలో ప్రభుత్వమే ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తలెత్తుతుంది’ అని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవడం కాదని, ఇది మహిళల న్యాయానికి సంబంధించిన విషయమన్నారు. గతంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి హిందూ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను అంతం చేయడానికి చట్టాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హిందూ సమాజం ఈ దురాచారాలపై చర్చించి వాటిని నిషేధిస్తూ చట్టాలు చేసిందన్నారు. అలాగే వరకట్న నిషేధ చట్టాన్ని చేశారని, హిందూ సమాజం దాన్ని స్వాగతించిందని వెంకయ్య గుర్తు చేశారు. ‘ఇలాంటి ఆచారాలు సమాజానికి మంచివి కావని భావించిన ప్రతి సందర్భాల్లోను హిందూ సమాజం వాటిపై చర్చించి సంస్కరణలు తీసుకొచ్చింది. మరికొన్ని సంస్కరణలు
కూడా అవసరముంది, ఆ దిశగా కృషి చేయాలి’ అన్నారు. ‘మనుషులను మనుషులుగా చూడాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంటూ వారిని వేరు చేయడానికి వీల్లేదు. అలాంటి వివక్ష వల్ల మహిళలకు ఎలాంటి న్యాయమూ జరగదు’ అని వెంకయ్య స్పష్టం చేశారు.
భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించిన ప్రతిసారీ తనకు సంతోషం కలుగుతుందని అన్నారు. ‘కులభూషణ్ జాధవ్ కేసునే తీసుకోండి. చరిత్రలో మొట్టమొదటిసారి మన దేశం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి జాధవ్‌ను ఉరి తీయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై స్టే తీసుకొచ్చింది. అందరూ సంతోషించదగ్గ విషయం ఇది’ అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ కెరీర్‌ను ప్రస్తావిస్తూ, నరేంద్ర మోదీ పదేళ్ల పాటు ప్రధానిగా ఉండాలన్న ఒకే ఒక కోరిక మిగిలి పోయిందన్నారు. మోదీ పదేళ్ల పాటు ప్రధానిగా ఉంటే మన దేశం ప్రపంచంలో మరింత బలమైన దేశంగా తయారవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య