జాతీయ వార్తలు

అమర జవాన్లకు కోటి పరిహారం హోం మంత్రి ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతులా, మే 20: దేశాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయే ప్రతి పారా మిలిటరీ జవానుకు కోటి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అంతేకాకుండా 34 వేల పారామిలటరీ కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. సిక్కింలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్ శనివారం భారత్- చైనా సరిహద్దుల్లోని షేరాతంగ్ సరిహద్దు ఔట్‌పోస్టువద్ద ఇండో- టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటిబిపి)ల ‘సైనిక్ సమ్మేళన్’లో పాల్గొని మాట్లాడారు. పారామిలటరీ జవాన్లను చూసి దేశం గర్విస్తోందన్నారు. పారామిలటరీ బలగాలు దేశ మధ్య, తూర్పు ప్రాంతాల్లో నక్సలైట్లతో, జమ్మూ, కాశ్మీర్‌లో మిలిటెంట్లతో పోరాడుతుండటమే కాకుండా అత్యంత క్లిష్టమైన వాతావరణం, పర్వత ప్రాంతాల్లో సరిహద్దుల్లో కాపలా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘మన జవాన్ల త్యాగాలను డబ్బుతో కొలవలేం. అయినప్పటికీ వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కోకూడదు. అందువల్ల ప్రతి పారామిలటరీ జవాను కుటుంబం కనీసం కోటి పరిహారం పొందేలా చూస్తాను’ అని రాజ్‌నాథ్ ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను నక్సలైట్లు దారుణంగా హతమార్చిన నెల రోజుల తర్వాత రాజ్‌నాథ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అంతకుముందు హోంమంత్రి నాతులాలోని సరిహద్దు పోస్టును సందర్శించి జవాన్లతో మాట్లాడారు. పారామిలటరీ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో చేసిందని అంటూ, రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. కాగా, వ్యక్తిగత సమస్యలతో పాటుగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి హోంశాఖ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్‌ను ఉపయోగించాలని ఆయన ఐటిబిపి జవాన్లను కోరారు. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు ఇచ్చే అలవెన్సు విషయంలో ఒకే విధానాన్ని తీసుకు రావాలన్న ఐటిబిపి డిమాండ్‌ను పరిశీలిస్తామని కూడా రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.

చిత్రం... సిక్కిం పర్యటనలో భాగంగా పారామిలటరీ జవాన్లతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్