జాతీయ వార్తలు

అసాధ్యం.. అసంభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవిఎంలను ట్యాంపర్ చేయలేరు ఆరోపించేవాళ్లు అగ్నిపరీక్షకు రావొచ్చు
జూన్ 3న హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం రాజకీయ పార్టీలకు సిఇసి సవాలు

న్యూఢిల్లీ, మే 20: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఇవిఎం) ట్యాంపర్ చేయవచ్చునంటూ కోడై కూస్తున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి సవాల్ విసిరింది. జూన్ 3నుంచి నాలుగు రోజులపాటు హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ మొదటి వారంలో తమ ఈవిఎంలను ట్యాంపర్ చేసి చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ రాజకీయ పార్టీలను సవాల్ చేశారు. జైదీ శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఈవిఎంలను ట్యాంపర్ చేయటం ఎవరితరమూ కాదని ప్రకటించారు. వాస్తవానికి రాజకీయ పార్టీలకు సిఇసి రెండు సవాళ్లు విసిరింది. మొదటిది ఈవిఎంలను ట్యాంపర్ చేసి చూపించటం, రెండోది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవిఎంలను ట్యాంపర్ పరీక్షలో పెడుతున్నందున అవకతవకలు జరిగాయని నిరూపించగలగటం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తమ కస్టడీలో పెట్టుకున్న ఈవిఎం యంత్రాలనే హ్యాకథాన్‌లో ఏర్పాటు చేస్తున్నామని జైదీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవిఎంలను అగ్ని పరీక్షకు ఉపయోగించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన అనంతరం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బిఎస్‌పి, సమాజ్‌వాదీపార్టీ తదితర పార్టీలు ఈవిఎంల ట్యాంపరింగ్ వల్లనే బిజెపి ఘన విజయం సాధించిందని ఆరోపించటం తెలిసిందే. ప్రతిపక్షం అంతటితో ఆగకుండా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక వినతిపత్రం అందజేసి ఈవిఎంల స్థానంలో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించాలని డిమాండ్ చేశాయి. ఈవిఎంల పట్ల ప్రతిపక్షాలకు ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించటం తెలిసిందే. ప్రతిపక్షాలు ఆ సమావేశంలో కూడా ఈవిఎంలను ట్యాంపర్ చేయవచ్చునంటూ అనుమానాలు వ్యక్తం చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు జూన్ 3న ఈవిఎంల ట్యాంపర్ పరీక్ష ఏర్పాటు చేసింది. జూన్ మూడో తేదీనాడు ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ అయినా ముందుకు వచ్చి తమ ఈవిఎంలను ట్యాంపర్ చేసి చూపించవచ్చని జైదీ చాలెంజ్ చేశారు. ‘ఈవిఎంల ట్యాంపరింగ్ పరీక్షలో ఎవ్వరూ విజయం సాధించలేరు, మా ఈవిఎంలను ట్యాంపర్ చేయటం అసాధ్యం’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఈవిఎంల పట్ల ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ ట్యాంపరింగ్ పరీక్ష ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ట్యాంపరింగ్ పరీక్ష సందర్భంగా తమ ఈవిఎంలలో ఎలాంటి మార్పులు చేసేందుకు అనుమతి ఇవ్వమని, తాము ఏర్పాటు చేసిన ఈవిఎం యంత్రాలను ట్యాంపర్ చేసి చూపించాలని ఆయన చెప్పారు. తమ ఈవిఎంలలోని భాగాలను మార్చేందుకు అనుమతి ఇవ్వటం జరగదన్నారు. ట్యాంపరింగ్ పరీక్షకు వచ్చే ప్రతి రాజకీయ పార్టీ ఒక ఈవిఎంను ఎంచుకుని దానిని ట్యాంపర్ చేసి చూపించవలసి ఉంటుందని జైదీ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈవిఎంలకు వైఫై, బ్లూటూత్ తదితర ఎలాంటి అనుసంధానత ఉండదు కాబట్టి వీటిని ట్యాంపర్ చేయటం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తమ ఈవిఎంలను ట్యాంపర్ చేసేందుకు వైఫై, బ్లూటూత్, కంప్యూటర్ దేనినైనా ఉపయోగించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈవిఎంలలోని ఏ మీటనైనా నొక్కి ట్యాంపర్ చేసి చూపించాలని జైదీ చెప్పారు.
రాజకీయ పార్టీలు ట్యాంపరింగ్ హ్యాకథాన్‌లో పాల్గొనటం గురించి మే 26 తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయవలసి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ ఈవిఎంల ట్యాంపరింగ్ కోసం ముగ్గురిని నామినేట్ చేయవలసి ఉంటుంది. నామినేట్ చేసిన వారినే హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తారు. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో ఉపయోగించిన వాటిలోనుండి నాలుగు ఈవిఎంలను ట్యాంపరింగ్ పరీక్షలో ఉపయోగించనున్నారు. రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన వారు తమకు ఇష్టమైన అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవిఎంను తీసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వాల్ట్ వద్ద ఈ యంత్రాలను రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన వారికి అప్పగిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వీరి వెంట ఈవిఎంల హ్యాకథాన్ కేంద్రానికి వస్తారు. రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన వారు తాము ఎంచుకున్న ఈవిఎంను తెరిచి అందులో అన్ని విడిభాగాలు ఉన్నాయో లేవో చూసుకోవచ్చు. అయితే వాటిలో మార్పులు,చేర్పులు చేసేందుకు అనుమతించరు. హ్యాకథాన్ మొత్తం వ్యవహారాన్ని వివిధ కోణాల నుండి వీడియో తీస్తారు. ఈవిఎంల మదర్‌బోర్డులో మార్పులు చేయడానికి కూడా అనుమతించరు. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం విలేఖరుల సమావేశానికి ముందు ఒక ఈవిఎంను అందరికీ ప్రదర్శించి చూపించింది.
చిత్రం... ఈవిఎంల పనితీరును మీడియాకు వివరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జైదీ