జాతీయ వార్తలు

ఎన్నికల ఖర్చు.. భరించొద్దు .. పార్లమెంటరీ కమిటీకి ఈసీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలన్న ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ వ్యతిరేకించింది. దీనికి బదులుగా రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చును నియంత్రించేందుకు వీలుగా విస్తృత స్థాయి సంస్కరణలు తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీకి తేల్చిచెప్పింది. ప్రైవేటు నిధులు, పార్టీ విరాళాలతోనే ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చును భరిస్తూ వచ్చాయి. ఇది మితిమీరడంతో ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించాలన్న ప్రతిపాదన దీర్ఘకాలంగా నలుగుతోంది. ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించినా దీనికి మించిన స్థాయిలో అభ్యర్థుల సొంత వ్యయాన్ని, ఇతరులు పెట్టే ఖర్చును నియంత్రించే అవకాశం ఉండదని ఎన్నికల కమిషన్ విస్పష్టంగా తెలియజేసింది. ఈ ప్రతిపాదన కంటే కూడా విస్తృత స్థాయిలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం వల్ల ఆశించిన ఫలితాలను సాధించవచ్చునని తెలిపింది. అసలు రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లోనూ , వాటి వ్యయానికి సంబంధించి పారదర్శక విధానాన్ని తీసుకురావడం వల్లే ఉపయోగం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని వివరాలనూ ప్రస్తావిస్తూ పార్లమెంటరీ స్థారుూ సంఘానికి లిఖిత పూర్వక నివేదిక అందించింది. ఇప్పటికే ఈ కమిటీ ఇవిఎమ్‌ల అంశంతో పాటు పేపర్ బ్యాలెట్లనే వాడాలన్న డిమాండ్లనూ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.