జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరకాశి, మే 23: ఉత్తరాఖండ్‌లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో 22మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణం చేస్తున్న బస్సు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో నాలుపానీ సమీపంలోని భగీరథి నదిలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన చార్‌దామ్ యాత్రికులేనని గంగోత్రి నుంచి హరిద్వార్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి కేదార్‌నాథ్ వెళ్లానని కూడా వారు భావించినట్టు తెలుస్తోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన అధికారులు 22 మృత దేహాలను వెలికితీశారు. రోడ్డు నుంచి దాదాపు 300మీటర్ల మేర దొర్లి ఈ బస్సు భగీరధిలో పడిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఎంత మంది ఉండి ఉంటారన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీని దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సహాయ చర్యలను ముమ్మర ప్రాతిపదికన చేపట్టేందుకు ఐటిబిపి, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర పోలీసులను రంగంలోకి దింపారు. ప్రమాద సమయానికే చీకట్లు కమ్ముకోవడం వల్ల సహాయ చర్యలు అనుకున్నంత వేగంగా జరుగడం లేదని తెలుస్తోంది. సురక్షితంగా వెలికితీసిన కొంత మందిని ఉత్తరకాశి, చిన్యాలిసౌర్‌లలోని ఆసుపత్రుల్లో చేర్చారు. ఈ ఘోర ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
chitram...
ప్రమాద స్థలంలో రెస్క్యు టీమ్