అంతర్జాతీయం

శాంతికోసం కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, మే 24: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటన జరుపుతున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి అమెరికా అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించాలని ట్రంప్‌ను కోరారు. తమ మధ్య అద్భుతమైన సమావేశం జరిగిందని ట్రంప్ అన్నారు. అంతేకాదు వాటికన్‌కు రావడం, పోప్‌ను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా పోప్ చూపు ట్రంప్ బరువుపై పడిందో ఏమో తెలియదు కానీ, మీ ఆయనకు ఆహారంగా ఏం పెడుతున్నావంటూ పక్కనే ఉన్న ట్రంప్ భార్య మెలానియాను సరదాగా అడిగారు. దీనికి ఆమె నవ్వేస్తూ ‘పోటికా’ అని సమాధానమిచ్చారు. పోటికా అనేది స్లోవేనియాలో నట్స్‌తో చేసిన ఒక కేక్. మెలానియా జన్మస్థలం స్లోవేనియా కావడం గమనార్హం. పోప్ ప్రాన్సిస్‌కు శాంతికి చిహ్నమైన ఆలివ్ ట్రీ చెక్కిన ఒక పతకాన్ని ట్రంప్‌కు బహూకరించారు. ‘మీరు శాంతికి కారణమవుతారన్న ఉద్దేశంతో నేను మీకు దీన్ని ఇస్తున్నాను’ అని పోప్ ఈ సందర్భంగా స్పానిష్ భాషలో ట్రంప్‌తో అన్నారు. మీరన్న మాటలను తాను గుర్తుంచుకుంటానని ట్రంప్ అన్నారు. నిజానికి పోప్ ఫ్రాన్సిస్ అనేక విషయాల్లో ట్రంప్ విధానాలతో తీవ్రంగా విభేదిస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామన్న ట్రంప్ ప్రకటనపై ఫ్రాన్సిస్ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. అలాగే పర్యావరణం, గర్భస్రావాలు లాంటి అనేక విషయాల్లో సైతం ఫ్రాన్సిస్, ట్రంప్ అభిప్రాయాలు పూర్తి భిన్నంగా ఉండడం అందరికీ తెలిసిందే. కాగా, పోప్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ వెంట ఆయన భార్య, కుమార్తె ఇవాంకా, అల్లుడు, ఆయన బృందంలోని ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. కాగా, తన తొలి పర్యటనలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాలను సందర్శించిన ట్రంప్ ఏకకాలంలో యూదులు, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన పవిత్ర స్థలాలను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ అభివర్ణించారు. కాగా, ఇయు, నాటో దేశాల నేతలతో చర్చలు జరపడం కోసం ట్రంప్ బ్రసెల్స్ వెళ్తారు.

వాటికన్ సిటీని సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ ఫ్రాన్సిస్‌తో కరచాలనం చేస్తున్న దృశ్యం