అంతర్జాతీయం

ఆత్మరక్షణ కోసమే హైడ్రోజన్ బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జనవరి 9: ఇటీవల తాము జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్షను ఉత్తర కొరియా గట్టిగా సమర్థించుకుంది. ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్, లిబియా నేత గడాఫీలకు ఎదురైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆత్మరక్షణ కోసం తామీ పరీక్షలు జరిపామని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు తమకున్న అధికారాన్ని వదులుకునే దేశాలకు ఎలాంటి గతి పడుతుందో సద్దాం, గడాఫీలకు ఎదురైన పరిస్థితిని బట్టి స్పష్టమవుతోందని ఉత్తర కొరియా తెలిపింది. అలాగే దక్షిణ కొరియా చేపడుతున్న చర్యలు రెండు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచి యుద్ధానిక ఆస్కారం ఇస్తున్నాయని పేర్కొంది. హైడ్రోజన్ బాంబు పరీక్ష వల్ల తమ దేశ సార్వభౌమత్వానికి మరింత ధీమా కలిగిందని తమ సరిహద్దులను పూర్తిస్థాయి సమర్ధతతో పరిరక్షించుకునే శక్తి సామర్ధ్యాలను సంతరించుకోగలిగామని తెలిపింది. అమెరికాసహా ఎవరూ కూడా తమపై కనె్నత్తిచూసే పరిస్థితి లేదని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర దేశాల దాడులకు, దురాక్రమణలకు దిగకుండా ఉండాలంటే అందుకు అణు సామర్థ్యాన్ని సంతరించుకోవడం ఒక్కటే మార్గమన్న వాస్తవాన్ని చరిత్ర అనేక సందర్భాల్లో కళ్లకు కట్టిందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఇరాక్, లిబియాలకు అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశమే ఇవ్వకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు వారు వదులుకోవడవం వల్ల సద్దాం, గడాఫీల ప్రభుత్వాలు అంతమైపోయాయని గుర్తుచేసింది.