జాతీయ వార్తలు
‘అసహన’ భయాలను ఆపని ప్రభుత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో అసహనం, మత విద్వేషాలు పెరిగి పోయిన ప్రస్తుత వాతావరణంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టడానికి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, రాజ్యాంగంలో ‘లౌకికవాదం’ పదం ఉండడమే దానికి ఇబ్బందికరంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు. లోక్‌సభలో శుక్రవారం రాజ్యాంగంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా పాల్గొంటూ, రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు దాని పీఠికలో సెక్యులరిజం అనే పదం లేదని, 1976లో 42వ సవరణ ద్వారా దాన్ని రాజ్యాంగంలో చేర్చారని అంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. సెక్యులరిజం అనే పదం ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉన్న ట్లు కనిపిస్తోందని, అందుకే చర్చలో దాన్ని హైలైట్ చేసారని ఆయన అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోవడం పట్ల రచయితలు, కళాకారులు వ్యక్తం చేస్తున్న నిరసనలపై ప్రభుత్వం వౌనంగా ఉండడంపై సింధియా ధ్వజమెత్తుతూ, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి అది ఏమీ చేయడం లేదన్నారు. ఇద్దరు దళిత చిన్నారులను సజీవంగా దసనం చేసినప్పుడు ఒక కేంద్ర మంత్రి కుక్క పోలిక ఇచ్చారని సింధియా చెప్పారు. ‘హిందుస్థాన్ హిందువుల కోసమే’ అన్న తన ప్రకటన గురించి ఒక గవర్నర్‌ను ఎవరో అడిగినప్పుడు ముస్లింలు కావాలనుకుంటే పాకిస్తాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్లవచ్చని ఆయన అన్నారని కాంగ్రెస్ నేత అన్నారు. కళాకారులు తమ అవార్డులను వాపసు చేస్తున్నప్పుడు ఒక సిట్టింగ్ ఎంపి వారిని లష్కరే తోయి బా వ్యవస్థాపకుడు హఫీజ్ సరుూద్‌తో పోల్చారని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాకాయలు కాలుస్తారని ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు సైతం వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.
లోక్‌సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా