అంతర్జాతీయం

2030 నాటికి చంద్రునిపై గ్రామాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 10: వ్యోమగాములు, రోబోటిక్ వ్యవస్థల మధ్య సహకారంతో చంద్రుడిపై గ్రామాలను నిర్మించాలన్న స్వప్నం 2030 సంవత్సరంలోగా సాకారం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో అంగారక గ్రహంతోపాటు మానవాళి జరిపే ఇతర ఖగోళ ప్రయోగాలకు ఈ గ్రామాలు వేదికగా నిలువగలవని ‘మూన్ 2020-2030-ఎ న్యూ ఎరా ఆఫ్ కోఆర్డినేటెడ్ హ్యూమన్ అండ్ రోబోటిక్ ఎక్స్‌ప్లోరేషన్’ అనే అంశంపై నెదర్లాండ్స్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్‌ఎ) నిర్వహించిన సింపోజియంలో శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లు, పారిశ్రామిక నిపుణుల బృందం స్పష్టం చేసింది. చంద్రునిపై గ్రామాలను నిర్మించాలన్న కలను నిజం చేయాలంటే తొలుత అక్కడ మనం అనుకుంటున్నంత పెద్దమొత్తంలో వనరులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని శాస్తవ్రేత్తలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని అమెరికాలోని నోట్రె డామ్ యూనివర్శిటీ శాస్తవ్రేత్త క్లైవ్ నెయల్ పేర్కొన్నారు. ‘ఇప్పటికీ మనం చంద్రునిపై ఉన్న వనరుల గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ అవి నిజంగా మనకు ఎంతమేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
కనుక మనం తదుపరి అడుగులో చంద్రునిపై వనరులను వెలికితీసి వినియోగానికి అనువైనవిగా వాటిని శుద్ధి చేసుకోగలగాలి. ఈ పని విజయవంతంగా పూర్తి చేయగలిగితే చంద్రునిపై ఉన్న వనరులు సౌర కుటుంబ అనే్వషణకు ఎంతమేర ఉపయోగపడతాయన్నదీ తెలుస్తుంది’ అని ఆయన అన్నారు.