జాతీయ వార్తలు

వచ్చే నెల 13న ఖేడ్ ఉపఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12:తెలంగాణలోని నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఫిబ్రవరి పదమూడో తేదీ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. తెలంగాణాతోపాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాలలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జనవరి 20న జారీ చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 27. నామినేషన్ల పరిశీలన 28న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ జనవరి 30. ఫిబ్రవరి 13న పోలింగ్ నిర్వహించి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉప ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 18న ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మరో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సోమవారంనుంచే అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.