జాతీయ వార్తలు

అత్తపై హత్యాయత్నం చితకబాదిన కోడలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజ్నోర్, జనవరి 12: కోడళ్లను వేధించే అత్తల ఆరళ్ల గురించి, మితిమీరిన పెత్తనం గురించి కథలు కథలుగా వింటాం. కానీ, అత్తలను అత్యంత అమానుషంగా చూసే, వేధించే కోడళ్లూ ఉంటారన్నది ఎంతైనా వాస్తవం. ఇందుకు యూపిలోని బిజ్నోర్‌లో వెలుగుచూసిన ఓ ఉదంతమే నిదర్శనం. 70 ఏళ్ల తన అత్తను ఓ కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అంతేకాదు, ఓ బట్టతో ఆమె మెడను నులిపేసేందుకు ప్రయత్నించింది. ఈ భయానక దృశ్యాన్ని ఆమె భర్తే చిత్రీకరించాడు. అంతే, సామాజిక మీడియాలో ఈ కిరాతక వీడియో హోరెత్తిపోయింది. ఈ వీడియోను సదరు భర్తే పోలీసులకు చూపించడం సంగీతా జైన్ అనే ఆయన భార్యను హత్యాయత్నం కేసు కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన జనవరి 5న జరిగింది. కొంతకాలంగా సంగీతా జైన్‌కు భర్తతోనూ, అత్తతోనూ విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. వీరి విడాకుల కేసులో స్థానిక కోర్టులో పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే తన భర్త సందీప్ జైన్‌పై వరకట్న వేధింపుల కేసు కూడా సంగీత దాఖలు చేసింది. దీంతో అతడ్ని జైలుకు కూడా పంపారు. అయితే తాను ఇంట్లో లేకపోతే తన తల్లిదండ్రులను తన భార్య చిత్రహింసలు పెడుతుందని భయపడ్డ సందీప్ తన తల్లి గదిలో రహస్యంగా సిసి కెమెరా పెట్టాడు. దాంతో జనవరి 5న జరిగిన ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు వెలుగుచూసింది.