జాతీయ వార్తలు

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: అత్యవసర పరిస్థితి విధించి ప్రాథమిక హక్కులతో పాటు చివరికి జీవించే హక్కును కూడా హరించివేసిన సం ఘటనలు పునరావృతం కాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకున్న అధికారంతో రాజ్యాంగానికి కళంకం తెచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగాఉండాలన్నారు. రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో జైట్లీ ప్రసంగించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు తట్టుకుని నిలబడిందని ఆయన ఉద్ఘాటించారు. 70వ దశకంలో అప్పటి ప్రభుత్వం తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిపై పరోక్షంగా విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుతో పాటు ఆస్తులను కూడకట్టుకునే హక్కును కూడా అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించకుండా 1933లో జర్మనీలో జరిగిన జరిగిన సంఘటనను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ‘జర్మనీ పార్లమెంట్ భవంతిని దహనం చేసే కుట్ర జరుగుతోందన్న మిసతో హిట్లర్ దేశంలో ఎమర్జన్సీ విధించారు. దానికి చట్టబద్ధత సాధించటానికి రాజ్యాంగ సవరణ చేపట్టారు. సవరణకు సభ ఆమోదం పొందడానికి ప్రతిపక్షాలను జైలుకుపంపారు. పత్రికలపై సెన్సార్ విధించారు. లక్ష్యం నెరవేరగానే 25 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి హిట్లరే జర్మనీ..జర్మనీ అంటేనే హిట్లర్ అని కీర్తింప చేసుకున్నారు’అని ఆయన పేర్కొన్నారు. ఆయన అత్యవసర పరిస్థితిని విధించిన తరువాత ఇందిరాగాంధీ హయంలో చోటుచేసుకున్న సంఘటనలను జైట్లీ పరోక్షంగా ప్రస్తావించి, రాజ్యాంగం అప్రతిష్టపాలుకాకుండా తగిన చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కాగా జైట్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ దూరదృష్టితో ఎంతో విజ్ఞతతో తయారు చేసిన రాజ్యాంగం నీరుకారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏకపక్ష పాలన అంతరించి పోయి రాజకీయ సమీకరణలు మారిపోవటం, ప్రాం తీయ పార్టీలు ఆవిర్భవించి కేంద్ర ప్రభుత్వాలలో భాగస్వాములవుతూ తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నందున గతం పునరావృతమయ్యే అవకాశాలుండవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశించినట్లు న్యాయవ్యవస్థ పని చేస్తోందా? ప్రభుత్వం కార్యనిర్వాహక వర్గం తమ విధులను నిర్వహించటంలో విఫలమవుతున్నందునే తా ము రంగంలోకి దిగక తప్పటం లేదని వాదిస్తూ న్యాయవ్యవస్థ మితిమీరిన ఉత్సాహంతో వ్యవహరించటం శుభపరిణామం కాదని జైట్లీ స్పష్టం చేశారు.
ఇలా ఉండగా ప్రజలందరికీ కు లం, మతంతో సంబంధం లేకుం డా ఉమ్మడి పౌర శిక్షాస్మృతిని అమలు చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని చెబుతూ ఆయన ఇప్పుడు జీవించి ఉంటే ఉమ్మడి పౌర శిక్షాస్మృతి ఉండాలన్న ఆయన వాదనపై రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉండేదోనని ఆయన ప్రశ్నించారు. ‘మనది మతతత్వదేశం కాదు. దేశానికి తీవ్రవాదం అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు మంగళం పాడాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
chitram..
రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో
మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ