జాతీయ వార్తలు

పఠాన్‌కోట్ తరహా దాడులు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ / ఇస్లామాబాద్, జనవరి 12: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి భారత్‌పై నిప్పులు చెరిగారు. పఠాన్‌కోట్ దాడికి కుట్రపన్నిన వారిపై ప్రధాని నవాజ్ షరీఫ్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మళ్లీ విషం కక్కారు. పఠాన్‌కోట్ దాడిపై భారత్ మితిమీరిన రీతిలోనే ప్రతిస్పందిస్తోందని, భవిష్యత్తులో కూడా ఈ రకమైన దాడులు ఎన్నో జరుగుతాయని ఆజ్ టీవీ అని పాకిస్తాన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉగ్రవాదం అన్నది భారత్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ ఉందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మితిమీరిన స్థాయిలో ప్రతిస్పందించకూడదని, రెండూ ఉగ్రవాద బాధిత దేశాలు కావడం అందుకు కారణమని తెలిపారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అంతేతప్ప మితిమీరిన స్థాయిలో ప్రతిస్పందించి పరిస్థితిని జటిలం చేయకూడదన్నారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో ఇరు దేశాలమధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం వాయిదా పడొచ్చునన్న సంకేతాలపై కూడా ముషారఫ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ రకమైన షరతులు విధించి పాకిస్తాన్‌ను భారత్ బెదిరించజాలదని అన్నారు. ఉగ్రవాద దాడులు ఎప్పుడు జరిగినా పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడం భారత్‌కు అలవాటయిపోయిందని, ఉగ్రవాదం, తీవ్రవాదం అన్నవి భారత్‌లోనూ ఉన్నాయన్న విషయం మరచిపోకూడదని అన్నారు. పాకిస్తాన్ చిన్న దేశమైనా దానికంటూ సొంత గౌరవ మర్యాదలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తే అయినా, తన సాహసాన్ని భారత్‌కు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని సూచించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి భారత్‌లోని ముస్లింలలో అసహనం పెరిగిపోయిందని చెప్పారు. నరేంద్ర మోదీ, అలాగే మాజీ ప్రధాని వాజపేయి మధ్య పోలిక తీసుకొచ్చిన ముషారఫ్, ‘వాజపేయి హయాంలో ఇరు దేశాల సంబంధాలు ఎంతో మెరుగయ్యాయి. అందుకు ఆయన నిజాయతీయే దోహదం చేసింది’ అని తెలిపారు.