జాతీయ వార్తలు

పంటలకు బీమా ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పంటలకు మెరుగైన బీమా సౌకర్యం కల్పించటంతోపాటు రైతు ప్రయోజనాల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన కొత్త బీమా పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పంటల బీమా పథకం 2016 ఖరీఫ్ నుంచి అమల్లోకిరానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్టు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు పిఐబిలో మీడియా సమావేశంలో పథకం వివరాలు వెల్లడించారు. ఈ పథకం మూలంగా తక్కువ ప్రీమియంతో పంటలకు ఎక్కువ బీమా లభించటంతోపాటు రైతుల కొనుగోలు శక్తిని గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ నిర్ణయం చారిత్రకమని మంత్రులు వెల్లడించారు. కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న జాతీయ వ్యవసాయ బీమా పథకం స్థానంలో కొత్త పథకాన్ని అమలు చేస్తామన్నారు. పంటల బీమాకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని బాగా తగ్గించటంతోపాటు, ప్రీమియానికి ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని వెంకయ్యనాయుడు వివరించారు. ఈ రాయితీ భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయన్నారు. పంటల బీమా పథకానికి బడ్జెట్ కేటాయింపులను 2823 కోట్ల నుంచి 7750 కోట్లకు పెంచినట్టు వెంకయ్య, రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. పంటల నష్టాన్ని త్వరగా అంచనావేసి సకాలంలో రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు రిమోట్ సెన్సింగ్, స్మార్ట్ ఫోన్లు, డ్రోన్లు ఉపయోగించుకుంటారని వెంకయ్య చెప్పారు. బీమా పోర్టల్‌ను రైతుల అవసరాలకు సంబంధించిన పనులను సమర్థంగా నిర్వహించేందుకు, సమన్వయానికి, పారదర్శకతకు ఉపయోగించుకుంటారని ఇరువురు మత్రులు తెలిపారు. పంటల బీమా సంస్థలకు జిల్లాను గ్రూపులగా కేటాయిస్తామన్నారు. దేశంలోని నలభై ఐదు జిల్లాల్లో యునిఫైడ్ ప్యాకేజీ ఇన్స్యూరెన్స్ పథకాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం అంగీకరించిందని మంత్రులు తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ సంబంధిత పంటల బీమాతోపాటు యంత్రాలు, రైతులు, ప్రమాదాలు, ఇళ్ళు, రైతులు, విద్యార్థుల భద్రత అంశాలకు బీమా కల్పిస్తాలని మంత్రులు చెప్పారు.
చిత్రం...
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు