జాతీయ వార్తలు

స్టేను ఎత్తివేసే సమస్యే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దాని అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఎన్.వి.రమణలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం నాటి ఆదేశాలను ఎత్తివేయడం కాని, సవరించడం కాని చేయబోనని బుధవారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌పై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తమిళనాడుకు చెందిన కొంతమంది బుధవారం మళ్లీ తాజా పిటిషన్లను దాఖలు చేశారు. జల్లికట్టును అనుమతించాలని వారు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.