జాతీయ వార్తలు

వైమానిక స్థావరం వెలుపల చైనా వైర్‌లెస్ సెట్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి ఎయిర్‌బేస్ వెలుపల నిలిచివున్న వాహనంలో చైనీస్ వైర్‌లెస్‌సెట్‌ను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొదటి నుంచీ అనుమానాలు రేకెత్తిస్తున్న పంజాబ్ పోలీసు అధికారి సల్వీందర్‌సింగ్‌ను బుధవారం మూడో రోజూ ప్రశ్నించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఎయిర్‌బేస్ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతోంది. దీన్లో భాగంగా వెలుపల పార్క్‌చేసి ఉన్న వాహనంలోంచి చైనాలో తయారైన వైర్‌లెస్ సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లేబొరెటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్)కి పరీక్షల నిమిత్తం పంపించారు. ఇలా ఉండగా గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ను ఎన్‌ఐఏ ప్రధాన కేంద్రంలో బుధవారం విచారించారు. ఈ కేసుకు సంబంధించి భిన్నకథనాలు వెలువడుతున్న నేపథ్యంలో మరిన్ని నిజాలు రాబట్టడానికి ఎన్‌ఐఏ ప్రయత్నిస్తోంది.