జాతీయ వార్తలు

సయోధ్య సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రాజ్యాంగంపై చర్చతో ప్రారంభమైనప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసలైన యుద్ధం నేటినుంచి ప్రారంభం కాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన జిఎస్టీ బిల్లు సహా అనేక కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కార్ గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో అది ఎంతవరకూ సాధ్యమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రధాని మోదీ సమావేశమైన నేపథ్యంలో వాస్తవికంగా ఈ సయోధ్య ఎన్టీయే సర్కార్‌కు ఎంతమేరకు ఉపకరిస్తుందన్నది నేటి సమావేశాలు జరిగే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. కీలక బిల్లుల మాటెలావున్నా దేశంలో పేట్రేగిపోతున్నట్టుగా చెబుతున్న మత అసహన ధోరణులపై విపక్షాలు గట్టిగానే సర్కార్‌ను నిలదీసే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ డిమాండ్ చేసిన విపక్ష నేతలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కొందరు మంత్రులపై చర్య తీసుకోవాలని కూడా పట్టుబడుతున్నారు. 267 నిబంధనను నిలిపివేసి మత అసహన ధోరణులపై చర్చను చేపట్టాలని కాంగ్రెస్, జెడియూలు ఇప్పటికే రాజ్యసభలో నోటీసులు ఇచ్చాయి. ఓటింగ్‌కు లేదా సభా కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అవసరం లేకుండా లోక్‌సభలో చర్చకు 193 నిబంధన కింద కాంగ్రెస్, సిపిఎంలు నోటీసులు ఇచ్చాయి. సోమవారమే ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది. రాజ్యాంగ నిబద్ధత అంశంపై చర్చ ముగిసిన తర్వాత రాజ్యసభలో ఈ వారంలో ఎప్పుడైనా ఈ నోటీసుల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 26నే పార్లమెంట్ భేటీ మొదలైనప్పటికీ రాజ్యాంగ పీఠికపై చర్చను చేపట్టినందున విపక్షాలు ఎలాంటి ఆటంకం కలిగించలేదు. సోమవారం నుంచి జరిగే సమావేశాలు అధికార పక్షానికి అసలైన పరీక్ష కాబోతున్నాయి. తాము ఇచ్చిన నోటీసుల సంగతేమిటని కాంగ్రెస్, జెడియూ, సిపిఎంలు పట్టుబట్టడం అనివార్యంగా కనిపిస్తోంది. ‘మా డిమాండ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిస్పందన తీరుపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి’అని విపక్షాలకు చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఉపనాయకుడు ఆనంద్ శర్మ నోటీసు ఇచ్చారు. దేశంలో ఒక రకమైన భయోత్పాత పరిస్థితుల్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అంశాన్ని ఆసరా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లోనూ విరుచుకు పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కళాకారులు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వడాన్ని చాలా బలమైన ఆయుధంగా కాంగ్రెస్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ సభలో ఓ తీర్మానం చేయాలని కూడా కాంగ్రెస్ తన నోటీసులో డిమాండ్ చేసింది. అసహన ధోరణులపై చర్చించాలని 267 నిబంధన కింద జెడియూ నోటీసు ఇచ్చింది. భిన్న వర్గాలను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన ఐదుగురు కేంద్ర మంత్రుల రాజీనామాకు కూడా డిమాండ్ చేసింది.