జాతీయ వార్తలు

ముస్లింలలోనే యువత ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: దేశంలోని అన్ని మతస్థుల్లోకెల్లా ముస్లిం మతస్థుల్లోనే యువత ఎక్కువగా ఉంది. భారత్‌లోని ముస్లింల జనాభాలో 47 శాతం మంది 20 ఏళ్లలోపువారే. హిందూ మతంలో పిల్లలు, టీనేజర్ల సంఖ్య 40 శాతం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జైనుల్లో 19 ఏళ్ల వయసు వరకు గల వారు కేవలం 29 శాతం మంది మాత్రమే ఉన్నారు. క్రైస్తవుల్లో 37 శాతం, సిక్కుల్లో 35 శాతం, బౌద్ధ మతస్థుల్లో 37 శాతం ఉన్నారు. భారత్‌లోని మొత్తం జనాభాలో 20 ఏళ్లలోపు వారు 20 శాతం మంది, 60 ఏళ్ల పైబడిన వారు తొమ్మిది శాతం మంది, మిగతా 50 శాతం మంది 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 45 శాతం ఉన్న 20 ఏళ్లలోపు వారి సంఖ్య 2011 నాటికి నాలుగు శాతం తగ్గింది. 2001లో దేశంలో 20 ఏళ్లలోపు వారి సంఖ్య హిందువుల్లో 44 శాతం, ముస్లింలలో 52 శాతం, జైనుల్లో 35 శాతం ఉండింది. దేశంలో అన్ని మతస్థుల్లోనూ పిల్లలు, టీనేజర్ల సంఖ్య తగ్గడాన్ని, మధ్య వయస్కులు, వృద్ధుల సంఖ్య పెరగడాన్ని ఈ రెండు జనాభా లెక్కలు సూచిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గల వారి సంఖ్య తొమ్మిది శాతం ఉండగా, ఆసక్తికరమైన అంశం ముస్లింలలో వీరి శాతం కేవలం 6.4 శాతమే ఉంది. అంటే జాతీయ సగటు కన్నా చాలా తక్కువగా ఉంది. జైనులు, సిక్కుల్లో వీరి సంఖ్య సుమారు 12 శాతం ఉంది. ఇటు పిల్లలు, అటు వృద్ధులు కూడా కుటుంబంలో పనిచేయగలిగిన వారిపై ఆధారపడుతున్నారని ఈ జనాభా లెక్కలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్లలోపు వయసు ఉండి, పెద్దలపై ఆధారపడుతున్న వారి సంఖ్య ప్రతి వెయ్యి మందిలో 2001లో 621 మంది ఉండగా, 2011లో 510కి తగ్గింది. దేశంలో పిల్లల సంఖ్య తగ్గడం వల్ల పెద్దలపై ఆధారపడిన పిల్లల సంఖ్య కూడా తగ్గింది. మరోవైపు, ఇతరులపై ఆధారపడిన పెద్దల సంఖ్య ప్రతి వెయ్యి మందిలో 2001లో 131 మంది ఉండగా, 2011 నాటికి 142కు పెరిగింది. ఈ పదేళ్ల కాలంలో దేశంలో పెద్దల సంఖ్య పెరగడం వల్ల వారిలో ఇతరులపై ఆధారపడిన వారి సంఖ్య కూడా పెరిగింది. మతాల వారిగా చూస్తే దేశంలో అత్యధికంగా ముస్లింలలో ప్రతి వెయ్యి మందికి 748 మంది ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారు. జైనుల్లో అత్యల్పంగా కేవలం 498 మంది మాత్రమే ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారు. హిందువల్లో 640 మంది ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారు.