అంతర్జాతీయం

పాక్‌లాంటి దేశాలు.. టెర్రరిస్టుల స్వర్గ్ధామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 13: కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పాకిస్తాన్, అఫ్గానిస్థాన్, మధ్యప్రాచ్య దేశాలు సురక్షితమైన స్థావరాలుగా మారే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం దేశ ప్రజలనుద్దేశించి చేసిన తన చివరి అధికారిక ప్రసంగంలో హెచ్చరిస్తూ, అమెరికాను, దాని మిత్ర దేశాలను సురక్షితంగా ఉంచడానికి తాను అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్‌లను వేటాడి తీరుతానని హామీ ఇచ్చారు. ‘అల్‌ఖైదా, ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ రెండింటినుంచి కూడా మన ప్రజలకు ముప్పు ఉంది. ఎందుకంటే నేటి ప్రపంచంలో తన ప్రాణాలే కాక ఎదుటి వారి ప్రాణాలకు సైతం ఏమాత్రం విలువ ఇవ్వని కొద్దిపాటి టెర్రరిస్టులు సైతం ఎంతో భారీ నష్టాన్ని కలిగించగలరు’ అని దాదాపు గంటసేపు చేసిన ప్రసంగంలో ఒబామా అన్నారు. అమెరికా విదేశాంగ విధానం అల్‌ఖైదా, ఐసిస్‌లనుంచి ఎదురవుతున్న ముప్పుపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే దానితో అది ఆగిపోజాలదు. ఎందుకంటే ఐసిస్ లేనప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో -మధ్యప్రాచ్యం, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, మధ్య అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా అస్థిరత కొనసాగుతోంది. ఈ ప్రాంతాలు కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద నెట్‌వర్కలకు సురక్షితమైన స్థావరాలుగా మారవచ్చు’ అని వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్ష పదవినుంచి వైదొలగనున్న ఒబామా అన్నారు. అంతేకాదు ఉగ్రవాదంపై పోరులో తనతో చేయి కలపాలని ఆయన ప్రతిపక్ష రిపబ్లికన్లను కోరారు. ఈ యుద్ధంలో విజయం సాధించాలని ఈ కాంగ్రెస్ (పార్లమెంటు) గనుక సీరియస్‌గా ఉన్నట్లయితే.. మన సైన్యానికి, ప్రపంచానికి ఒక సందేశం పంపాలని అనుకుంటే, ఐఎస్‌ఐఎస్‌పై సైనిక శక్తిని ఉపయోగించడానికి మీరు ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి’ అని ఒబామా రిపబ్లికన్లనుద్దేశించి అన్నారు. ‘అయితే కాంగ్రెస్ అనుమతించినా, అనుమతించక పోయినా ఇంతకుముందు ఉగ్రవాదులకు ఎలాంటి గుణపాఠాలు చెప్పామో, ఐఎస్‌ఐఎస్‌కు కూడా అదే గతి పడుతుందనే విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు అమెరికన్లను వేటాడితే మేము కూడా మిమ్మల్ని వేటాడుతాం.. దీనికి కొంత సమయం పట్టవచ్చునేమో కానీ, మా లక్ష్యానికి పరిమితి లేదు’ అని ఒబామా స్పష్టం చేసారు. ఒబామా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించడం వరసగా ఇది ఎనిమిదోసారి.