జాతీయ వార్తలు

మాజీ లెఫ్టినెంట్ జనరల్ జాకబ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో ఢాకాలోని ఆ దేశ బలగాలు భారత్ బలగాలకు లొంగిపోవడానికి సంప్రదింపులు జరిపిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జె.ఎఫ్.ఆర్.జాకబ్ (92) కన్నుమూశారు. చాలారోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న జాకబ్ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. 1923లో జన్మించిన జాకబ్ భారత్-పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించడంలో, బంగ్లాదేశ్ అవతరించడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ యుద్ధ సమయంలో మేజర్ జనరల్ హోదాలో ఉన్న జాకబ్ ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్‌కు చీఫ్ ఆఫ్ స్ట్ఫాగా పనిచేశారు. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించిన జాకబ్ తన 19వ ఏట భారత సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ తరపున వీరోచితంగా పోరాడిన జాకబ్ 1978లో పదవీ విరమణ పొందారు. ఆ తరువాత కాలంలో ఆయన గోవా, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జాకబ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిష్కళంకమైన సేవలు అందించిన జాకబ్‌కు భారతదేశం రుణపడి ఉంటుందని మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జాకబ్, తాను తరచుగా కలుసుకునే వారమని ఆయన వెల్లడించారు. జాకబ్ తన ఆటోబయోగ్రఫీని బహూకరించిన సందర్భంగా జరిగిన భేటీ తనకు ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటుందని ప్రధాని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాక్‌బ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, ఆయనను భారతదేశ సాహసోపేత పుత్రుడిగా అభివర్ణించారు. ఒక సైనికుడిగా, దేశభక్తుడిగా ఆయన దేశానికి అందించిన సేవల పట్ల దేశం గర్విస్తోందని ఆమె పేర్కొన్నారు.

మాజీ లెఫ్టినెంట్ జనరల్ జె.ఎఫ్.ఆర్.జాకబ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, నావెల్ చీఫ్ అడ్మిరల్ ఆర్.కె.్ధవన్, ఎయర్ చీఫ్ మార్షల్ అరూర్ రహా. న్యూఢిల్లీలో 2014 డిసెంబర్‌లో జరిగిన కార్యక్రమం నాటి చిత్రమిది.