జాతీయ వార్తలు

కరవు సాయం 791 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 14: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కరువు సహాయం కింద 791 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నుండి ఈ మేరకు సాయం అందించాలని నిర్ణయించారు. కరువు సహాయం కింద తమకు 1500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయటం తెలిసిందే. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుబుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి కేంద్ర సహాయం 1500 కోట్లకు తక్కువ కాకూడదని విజ్ఞప్తి చేయటం తెలిసిందే. అయితే రాజ్‌నాథ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ తెలంగాణ ప్రభుత్వం పంపించిన నివేదికతోపాటు కేంద్ర పరిశీలకుల బృందం చేసిన సిఫారసులను అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్రానికి కరువు సహాయం కింద 791 కోట్ల రూపాయల సహాయం అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణతోపాటు మరో పది రాష్ట్రాల్లో దాదాపు 280 జిల్లాలను కరవుపీడిత ప్రాంతాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. నైరుతీ రుతుపవనాల కారణంగా నమోదు కావలసిన సాధారణ వర్షపాతం కన్నా 14 శాతం తక్కువగా ఈ ప్రాంతాల్లో నమోదైంది. ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల వర్షాలు తక్కువ కురిశాయని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాభావంవల్ల పంటలు పూర్తిగా ఎండిపోవడమో, దిగుబడి భారీగా తగ్గడమో జరగడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. గురువారం జరిగిన ఉన్నతస్థాయి కమిటి సమావేశానికి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు మంత్రులు అరుణ్ జైట్లీ, రాధామోహన్ సింగ్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహెర్షీ, హోం, ఆర్థిక, వ్యవసాయ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.