జాతీయ వార్తలు

అట్టడుగుస్థాయి విజేతలే ఆదర్శనీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: రాజకుటుంబాలు, వాటికి చెందిన నేతల పట్ల ప్రత్యేక విధేయతలకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిన్న స్థాయిలో ఉన్నా నిరుపమాన పట్టుదల, అంకిత భావంతో ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న వారిపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని విధాలుగా సానుకూలంగా ఉండే పరిస్థితుల్లోనే అద్భుతాలు సాధ్యమవుతాయన్నది తప్పని, ఎన్నో అవరోధాలు, అవాంతరాలు ఎదుర్కొని అద్భుతాలు సృష్టించిన వారిని విస్మరించడానికి వీల్లేదని తెలిపారు. గత 250 సంవత్సరాలుగా రాజకుటుంబాలు, పాలకులపైనే దృష్టి పెట్టడం, వారి గురించే రాయడం జరుగుతూ వస్తోందని, ఇది మన దురదృష్టమని అన్నారు. ఇది దేశాన్ని బానిసత్వ కోరల్లోనే కొనసాగించేందుకు జరిగిన కుట్ర అని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగడానికి అడ్డుకట్ట వేయాలన్నారు. చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నా వారి పట్ల ఇంకా చిన్నచూపే కొనసాగుతోందన్నారు. టైమ్స్ నౌ అమేజింగ్ ఇండియన్స్ అవార్డు ప్రదానం సందర్భంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులే చరిత్రను తిరగరాస్తారని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలున్నాయన్నారు.

న్యూఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నౌ
అమేజింగ్ ఇండియన్స్ అవార్డుల ప్రదానం
సందర్భంగా ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ