జాతీయ వార్తలు

ఐఎస్‌ఐ గూఢచర్యం ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/న్యూఢిల్లీ, నవంబర్ 29: పాకిస్తాన్ గూఢచార ఏజన్సీ ఐఎస్‌ఐ మద్దతుతో దేశంలో గూఢచర్యం నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేయడమే కాక ఆ సంస్థకు చెందిన కార్యకర్తను, సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్)కు చెందిన ఓ జవానును అరెస్టు చేసారు.
దేశ భద్రతకు హానికరంగా ఉండే రహస్య సమాచారాన్ని సేకరించడానికి పాకిస్తాన్ ఇంటెలిజన్స్ ఆపరేటివ్‌కు సహకరిస్తున్నందుకు బిఎస్‌ఎఫ్‌లో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరినీ అధికార రహస్యాల చట్టంలోని నిబంధనల కింద అరెస్టు చేసారు. అరెస్టు చేసిన ఇద్దరిని జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు చెందిన కఫితుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజా(44)గా, అదే జిల్లాలో బిఎస్‌ఎఫ్ ఇంటెలిజన్స్ విభాగంలో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్‌గా గుర్తించారు.
పాకిస్తాన్ ఇంటెలిజన్స్ ఆపరేటివ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అందిన సమాచారాల ఆధారంగా ఈ ఆపరేషన్‌ను అమలు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ నెట్‌వర్క్‌లో పౌరులే కాకుండా భద్రతా దళాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఢిల్లీ పోలీసు క్రైమ్‌బ్రాంచ్ కూడా ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన కొంతమంది అనుమానితులను గుర్తించింది. గురువారం నాడు ఖాన్ జమ్మూలో ఒక రైలు ఎక్కి భోపాల్ వెళ్లబోతుండగా ఒక పోలీసు బృందం రైల్వే స్టేషన్‌లో అతడ్ని అరెస్టు చేసిందని, అతని వద్దనుంచి దేశ భద్రతకు భంగకరంగా ఉండే కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) రవీంద్ర యాదవ్ చెప్పారు.
మరో సంఘటనలో పాకిస్తాన్ తరఫున గూఢచర్యం నిర్వహిస్తున్న ముగ్గురిని కోల్‌కతా పోలీసుకు చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్ ఆదివారం అరెస్టు చేసింది. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న ఇర్షాద్ అన్సారీ, ఆయన కుమారుడు అస్ఫక్ అన్సారీ, బంధువు మహమ్మద్ జహంగీర్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.