జాతీయ వార్తలు

ఆవిష్కరణలకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో నూతన ఆవిష్కరణల వ్యాపారం ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలాంటి స్టార్టప్‌లకు మూడేళ్లపాటు పన్ను మినహాయింపు ప్రకటిస్తూ, మూడేళ్లపాటు తనిఖీలులేని విధానాన్ని, క్యాపిటల్ గెయిన్స్ పన్నునుంచి మినహాయింపు ప్రకటించారు. అలాగే పదివేల కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇవేకాకుండా 9 కార్మిక, పర్యావరణ చట్టాలకు సంబంధించి సెల్ఫ్ సర్ట్ఫికెట్ల పథకాన్ని ప్రకటించారు. పరిశ్రమ ప్రారంభించిన తొలి మూడేళ్లలో ఎలాంటి తనిఖీలూ ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్టార్టప్ వ్యాపారాలు పేటెంట్లను రిజిస్టర్ చేసుకోవడానికి వీలుగా ఒక సరిళీకృత పేటెంట్ విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు. అలాగే పేటెంట్లను రిజిస్టర్ చేసుకోవడానికి ఫీజును 80శాతంమేర తగ్గిస్తామని కూడా ప్రధాని ప్రకటించారు. శనివారం ఇక్కడ స్టార్టప్ పారిశ్రామికవేత్తల తొలి సదస్సులో ప్రధాని మాట్లాడుతూ దేశంలో ఉపాధి కల్పన, సంపద సృష్టికి అత్యంత కీలకమైన ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సేకరణ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అనుభవం, టర్నోవర్ ప్రాతిపదకలను కూడా తొలగిస్తున్నట్టు మోదీ చెప్పారు. వ్యాపారం ప్రారంభించిన తొలి మూడేళ్లపాటు స్టార్టప్‌లు ఆర్జించే లాభాలకు ఆదాయ పన్ను చెల్లింపునుంచి మినహాయింపు ఇస్తామన్నారు. అలాగే, తమ సొంత ఆస్తులు అమ్ముకుని పారిశ్రామికవేత్తలు పెట్టే పెట్టుబడులపైన, అలాగే ప్రభుత్వ గుర్తింపు వెంచర్ క్యాపిటలిస్టులు జరిపే పెట్టుబడులపైన విధించే 20శాతం క్యాపిటల్ గెయిన్ పన్ను కూడా మినహాయిస్తామన్నారు. ఒకవేళ పరిశ్రమలకు నష్టాలువచ్చి వైదొలగాల్సి వస్తే 90 రోజుల్లోనే దివాలా చట్టంకింద సులభంగా వైదొలగే అవకాశాన్ని కల్పించనున్నామన్నారు. స్టార్టప్‌లపై రెగ్యులేటరీ భారాన్ని తగ్గించటం కోసమే స్వయం ధ్రువీకరణ విధానం తెస్తున్నామన్నారు. గ్రాడ్యుటీ చెల్లింపు, కాంట్రాక్టు లేబర్, ఉద్యోగుల భవిష్యనిధి, జల వాయు కాలుష్య చట్టాలకు ఈ స్వయం ధ్రువీకరణ వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం, రెగ్యులేటరీ సంస్థలతో సంప్రతింపులు జరపడం కోసం స్టార్టప్ మొబైల్ యాప్, పోర్టల్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ నిబంధనలు సడలింపువల్ల స్టార్టప్‌లకు అనుభవమున్న పారిశ్రామికవేత్తలు లేదా కంపెనీలతో సమానంగా అవకాశాలు కల్పించినట్టు అవుతుందని తెలిపారు. స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు ప్రభుత్వం 2500 కోట్ల ప్రారంభ నిధితో నాలుగేళ్లలో పదివేల కోట్ల రూపాయలమేర కార్పస్ నిధి ఏర్పాటు చేయనున్నట్టు కూడా ప్రధాని తెలిపారు. ప్రయివేట్ నిపుణులు నిర్వహించే ఈ నిధికి ఎల్‌ఐసి సంస్థ సహా పెట్టుబడిదారిగా ఉంటుందన్నారు. అలాగే రానున్న నాలుగేళ్లలో ఏడాది 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుద్వారా జాతీయ క్రెడిట్ ట్రస్ట్ కంపెనీని ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.

చిత్రం... స్టార్టప్ ఇండియా సదస్సులో అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీ