అంతర్జాతీయం

మా వైఖరి మారలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమల్లా, జనవరి 17: పాలస్తీనా పట్ల దీర్ఘకాలికంగా తాము అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పులేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశానికి స్పష్టం చేశారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఆదివారం ఇక్కడ పాలస్తీనా విదేశీ వ్యవహారాల మంత్రితో చర్చలు జరిపారు. ఆదివారం ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా భూభాగంలో అడుగుపెట్టిన సుష్మా స్వరాజ్‌కు బితునియా చెక్‌పాయింట్ వద్ద పాలస్తీనా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మాజెన్ షమియేహ్ ఘన స్వాగతం పలికారు. ఇక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే సుష్మా స్వరాజ్ పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో చర్చలు జరిపారు. రమల్లాలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. సుష్మా స్వరాజ్, రియాద్ అల్ మాలికి మధ్య జరిగిన చర్చల వివరాలను పాలస్తీనా విదేశాంగ మంత్రి మీడియా డిపార్ట్‌మెంట్ అధిపతి బట్రెఖి పిటిఐ వార్తాసంస్థకు వెల్లడించారు. భారత్ తమకు విస్తృత అంశాల్లో నిరంతరం అందిస్తున్న సహకారం పట్ల పాలస్తీనా విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. పాలస్తీనాలో సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియను క్రియాశీలకం చేయడానికి భారత్ క్రమం తప్పకుండా అందిస్తున్న మద్దతు పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలస్తీనాతో సంబంధాల విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సుష్మా స్వరాజ్ ఈ చర్చల్లో స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య బలోపేతమవుతున్న బంధం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం పాలస్తీనా సమస్యపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌లో భారత్ అనుసరించిన వైఖరి ఈ చర్చల్లో ప్రస్తావనకు రాలేదని బట్రెఖి తెలిపారు.

రమల్లాలో ఆదివారం పాలస్తీనా విదేశీ వ్యవహారాల మంత్రి రియాద్ అల్ మాలికితో చర్చలు జరుపుతున్న సుష్మా స్వరాజ్

అఫ్గాన్‌లో మరో పేలుడు
13 మంది మృతి

జలాలాబాద్, జనవరి 17: అఫ్గాన్‌లో ఆదివారం మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు అఫ్గాన్‌లోని జలాలాబాద్‌లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుని నివాసం వద్ద పేలుడు సంభవించింది. ఇంతకుముందు బుధవారంనాడు పాక్ కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ జీహాదీలు ప్రకటించుకున్నారు. నన్‌గార్‌హర్ ప్రావిన్స్‌లో పేరుమోసిన రాజకీయ నాయకుడు ఒబైదుల్లా షిన్వారీ నివాసాన్ని టార్గెట్‌గా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిందని, ఈ దాడిలో 13 మంది మరణించారని నన్‌గార్‌హర్ గవర్నర్ విలేఖరులకు తెలిపారు. అయితే ఈ పేలుడులో షిన్వారీకి ఎటువంటి ప్రమాదం జరగలేదు.