అంతర్జాతీయం

పాక్ వర్సిటీపై తాలిబన్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, జనవరి 20: పాకిస్తాన్‌లో కల్లోలిత ఖైబర్-్ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక బచాఖాన్ యూనివర్సిటీపై బుధవారం భారీ ఆయుధాలు ధరించిన తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు దాడి చేసి తరగతి గదులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో కనీసం 25 మంది చనిపోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని పెషావర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని చార్‌సద్దా వద్ద సరిహద్దు గాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (బచాఖాన్) గౌరవార్థం ఆయన పేరున ఏర్పాటు చేసిన బచాఖాన్ యూనివర్సిటీలోకి చొరబడిన దుండగులు తరగతి గదులు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, అధ్యాపకులపై కాల్పులు జరపడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. క్యాంపస్‌లోపలినుంచి పెద్ద ఎత్తున పేలుళ్లు, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దాడి జరిగిన సమయంలో 1988 జనవరి 20న మృతి చెందిన బచాఖాన్ వర్ధంతిని పురస్కరించుకుని యూనివర్సిటీలో కవితా సదస్సు జరుగుతోంది. ఈ దాడిలో ఒక ప్రొఫెసర్ సహా 25 మంది చనిపోయారని, మరో 50 మంది దాకా గాయపడ్డారని తెహ్రీక్ -ఏ-ఇన్సాఫ్ పార్టీ నాయకుడు, రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు షౌకత్ యూసఫ్‌జాయ్ చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పాటు అన్ని స్కూళ్లను మూసివేశారు. 2014 డిసెంబర్‌లో పెషావర్‌లో ఓ ఆర్మీ స్కూలుపై తాలిబన్ మిలిటెంట్లు దాడి చేసి 150 మంది దాకా విద్యార్థులను మూకుమ్మడిగా హత్య చేసిన దాదాపు13 నెలలకు ఈ దాడి జరగడం గమనార్హం. దాడిలో నలుగురినుంచి పది మంది మధ్య మిలిటెంట్లు పాల్గొన్నారని యూసఫ్‌జాయ్ చెప్పారు. ఇలాంటి పిరికిపంద దాడులు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలన్న ప్రభుత్వ కృతనిశ్చయాన్ని దెబ్బతీయలేవని కూడా ఆయన చెప్పారు. దాడి మొదలైన వెంటనే పెద్ద సంఖ్యలో సైనికులు యూనివర్సిటీకి హుటాహుటిన చేరుకుని క్యాంపస్‌లోంచి విద్యార్థులను బైటికి తీసుకు రావడం ప్రారంభించారు.
యూనివర్సిటీలో మిలిటెంట్లను ఏరివేయడానికి సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమైనట్లు ఆర్మీ ప్రతినిధి లెఫ్టెనెంట్ జనరల్ అసిమ్ సలీమ్ బాజ్వా ట్విట్టర్‌లో తెలిపారు. ‘్భవనం పైభాగాన స్నైపర్లు ఇద్దరు టెర్రరిస్టులను కాల్చి చంపారు. ఇప్పటివరకు హతమైన టెర్రరిస్టుల సంఖ్య నాలుగు.. అన్ని భవనాలను రూఫ్‌టాప్‌లను సైన్యం తన అధీనంలోకి తీసుకుంది’ అని ఆయన తెలిపారు. సైన్యం ఒక్కో బ్లాక్‌ను ఖాళీ చేయించే పని కొనసాగుతోందని కూడా ఆయన తెలిపారు. యూనివర్సిటీ బ్లాక్‌లోపల కాల్పులు జరుపుతున్న మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా సైన్యం కాల్చి చంపింది. ఉగ్రవాదులు క్యాంపస్‌లోని రెండు బ్లాక్‌లకు పరిమితం అయ్యారని, సైన్యం, కమాండోలు ఆపరేషన్‌లో పాల్గొన్నారని ఉన్యం తెలిపింది. ఆపరేషన్ ముగిసిందని, మొత్తం నలుగురు మిలిటెంట్లను హతమార్చామని సైన్యం తెలిపింది.యూనివర్సిటీని ఖాళీ చేయించే పని కొనసాగుతోందని సైన్యం తెలిపింది. కాగా, యూనివర్సిటీ భవనంపై ఆర్మీ హెలికాప్టర్ల చక్కర్లు కొట్టడం కనిపించింది.
ఇదిలా ఉండగా ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ ప్రకటించుకుంది. పెషావర్ స్కూలు దాడి జరిగినప్పటినుంచి భద్రతా దళాల చేతిలో మృతి చెందిన తమ వారికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి మీడియా సంస్థలకు ఫోన్ చేసి చెప్పాడు. దాడులు కొనసాగుతాయని కూడా ఆయన హెచ్చరించాడు. కాగా, దాడి జరిగిన సమయంలో యూనివర్సిటీలోపల దాదాపు 3 వేల మంది విద్యార్థులకు తోడు కవితా సదస్సులో పాల్గొనడం కోసం వచ్చిన 600 మంది అతిథులున్నారని యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఫాజల్ రహీమ్ చెప్పారు.

చిత్రం... తాలిబాన్ల దాడి ఘటనతో వర్శిటీ నుంచి అధ్యాపకులు, విద్యార్థులను బయటకు తరలిస్తున్న పాక్ బలగాలు