అంతర్జాతీయం

జిహాదీ జాన్ మృతిని ధ్రువీకరించిన ఐసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 20: గత నవంబర్‌లో సిరియా పట్టణం రక్కాపై అమెరికా నేతృత్వంలో జరిగిన డ్రోన్ దాడిలో ‘జిహాదీ జాన్’గా పిలవబడే బ్రిటన్‌కు చెందిన ముసుగు మిలిటెంట్ చనిపోయినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంటు గ్రూపు ధ్రువీకరించింది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు విడుదల చేసిన పలువురు పాశ్చాత్య బందీల శిరచ్ఛేదం వీడియోలలో మసుగు ధరించి ఉన్న ఓ టెర్రరిస్టు వారి శిరచ్ఛేదంను అమలు చేస్తూ కనిపించేవాడు. అతనినే ‘జిహాదీ జాన్’గా అందరూ వ్యవహరించే వారు. బ్రిటన్‌కు చెందిన ఈ 27 ఏళ్ల మిలిటెంటు అసలు పేరు మహమ్మద్ ఎమ్వాజి. అయితే ఆ తర్వాత అబూ ముహరిబ్ అల్ ముహజిర్ ఎమ్వాజీగానే అతను వ్యవహరించబడుతూ వచ్చాడు. ఐఎస్ ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్ ‘దబిక్’లో ఆ సంస్థ అతనికోసం ఒక శ్రద్ధాంజలి వ్యాసాన్ని ప్రచురించింది. ఐఎస్ మిలిటరీ విజయాల్లో ఎమ్వాజి పాత్రను, అతను పాల్గొన్న పలు సాహస చర్యలను ఆ వ్యాసంలో వివరించారు. ఎమ్వాజి ప్రయాణిస్తున్న కారును అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ఢీకొట్టింది. కారులో జిహాదీ జాన్ సహా మరో వ్యక్తి కూడా ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐఎస్ విడుదల చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలీ దారుణ హత్య వీడియోలో ఎమ్వాజి తొలిసారిగా కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆ తర్వాత బ్రిటీష్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త డేవిడ్ హెయిన్స్, టాక్సీ డ్రైవర్ అలాన్ హెన్నింగ్స్ శిరచ్ఛేదం వీడియోలలో కూడా కనిపించాడు.