జాతీయ వార్తలు

దాడులకు ఉగ్రవాదుల కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ఉత్తరాఖండ్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టుతో హరిద్వార్‌లో జరిగే అర్ధ్ కుంభమేళా సందర్భంగా దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్ర బయటపడిందని ఢిల్లీ పోలీసులు బుధవారం చెప్పారు. అర్ధ్ కుంభమేళా సందర్భంగా హరిద్వార్ వైపు వెళ్తున్న రైళ్లపై, దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలపై దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. హరిద్వార్ జిల్లాలోని మంగళూరులో పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన అనుమానిత ఉగ్రవాదులు అఖ్లాక్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ ఒసామా, మొహమ్మద్ అజీం షా, మెహ్‌రోజ్‌లను బుధవారం ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరిని 15 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిందని ప్రత్యేక పోలీసు కమిషనర్ అరవింద్ దీప్ చెప్పారు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ నలుగురు అనుమానిత ఉగ్రవాదులను వెంటాడి అరెస్టు చేశారు. అర్ధ్ కుంభమేళా సందర్భంగా దాడులకు పాల్పడాలని ఈ నలుగురు కుట్ర పన్నినట్లు అరవింద్ దీప్ తెలిపారు. అరెస్టయిన నలుగురిలో అఖ్లాక్‌ను పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించి కూడా విచారిస్తున్నట్లు ప్రత్యేక పోలీసు కమిషనర్ చెప్పారు. ఈ నలుగురు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో వెల్లడించడానికి దీప్ నిరాకరించారు. దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్రను పూర్తిస్థాయిలో భగ్నం చేసేంతవరకు దేశ రాజధానికి ముప్పు పొంచి ఉందని వివరించారు. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలో భద్రతా పరిస్థితులపై సీనియర్ అధికారులు బుధవారం సమావేశమై చర్చించారని ఒక అధికారి చెప్పారు.

దళిత విద్యార్థి ఆత్మహత్యపై
నివేదిక కోరిన కేంద్ర సామాజిక న్యాయ శాఖ

న్యూఢిల్లీ, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి ఆత్మహత్య ఉదంతంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వంనుంచి నివేదిక కోరింది. సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసిఎస్‌ఎస్‌ఆర్) చైర్మన్ సుఖ్‌దేవ్ థోరట్ సామాజిక న్యాయ శాఖ మంత్రి తవర్ చంద్ గెహ్లోట్‌ను కలిసి బహిష్కరణకు గురయిన విద్యార్థులు ఇచ్చిన ఓ వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. రోహిత్ మృతికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలే కారణమని బిజెపి వ్యతిరేక పక్షాలు ఆరోపిస్తూ వారిని మంత్రి పదవులనుంచి తప్పించాలని డిమాండ్ చేస్తుండడం తెలిసిందే.
ఆత్మహత్యపై దాఖలయిన ఎఫ్‌ఐఆర్‌లో కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ, హెచ్‌సియు వైస్ చాన్సలర్‌లను నిందితులుగా పేర్కొన్నారు కూడా. యూనివర్సిటీలోని కొంతమంది విద్యార్థుల జాతి వ్యతిరేక కార్యకలాపాలపై చర్య తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన కారణంగానే దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. గత ఏడాది ఆగస్టులో ఒక విద్యార్థిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న రోహిత్ సహా అయిదుగురు దళిత రిసెర్చ్ విద్యార్థులను యూనివర్సిటీ సస్పెండ్ చేయడం చేయడం ఈ వివాదానికి మూలకారణం. హైదరాబాద్‌లోనే కాకుండా ఢిల్లీ, ముంబయి, పుణె, చెన్నై తదితర నగరాల్లో సైతం విద్యార్థి సంఘాలు ఈ సంఘటనపై నిరసన ప్రదర్శనలు జరిపి, మంత్రులను తొలగించడంతో పాటు హెచ్‌సియు వైస్ చాన్సలర్‌పై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం తెలిసిందే.