జాతీయ వార్తలు

సరిహద్దుల్లో పెరిగిన చొరబాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/న్యూఢిల్లీ, నవంబర్ 29: పాకిస్తాన్ వైపునుంచి చొరబాట్లు హటాత్తుగా పెరగడం, గత పది వారాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లు 20నుంచి 25 మంది దాకా ఉగ్రవాదులను కాశ్మీర్‌లోకి పంపించినట్లు అనుమానిస్తుండడంతో కాశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేసారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి చొరబాట్లు పెరిగాయని, పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఈ రెండు ముఠాలు బలహీనంగా ఉన్న ఉత్తర కాశ్మీర్‌లో స్థావరాలను ఏర్పాటు చేయాలని అవి అనుకుంటున్నాయని గత ఎనిమిది వారాలుగా కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తే అర్థమవుతుంది. దాదాపు పాతికమంది దాకా ఉగ్రవాదులు కుప్వారా జిల్లాలోని ఎత్తయిన పర్వత ప్రాంతాలకు చేరుకున్నారని, కాశ్మీర్ లోయలోకి ప్రవేశించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని వివిధ నిఘా ఏజన్సీలనుంచి సేకరించిన సమాచారాన్ని లోతుగా విశే్లషించినప్పుడు అర్థమవుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర కాశ్మీర్‌లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని, అక్కడ పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాలకు చెందిన కార్యకర్తలు, సానుభూతిపరుల సాయంతో స్థానిక ప్రజలతో కలిసి పోవాలని పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లకు ఆదేశాలు ఇచ్చిందని ఆ వర్గాలు అంటున్నాయి. కుప్వారాలోని హిమాలయ పర్వత శ్రేణుల్లోని మనిఘా అడవుల్లో నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికీ సైన్యానికి, మిలిటెంట్లకు మధ్య అడపా దడపా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు పది మంది లష్కరే తోయిబా టెర్రరిస్టులు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న శంసబరి రేంజి గుండా మన భూభాగంలోకి ప్రవేశించాక మనిఘా అడవుల్లోకి చేరుకుని అక్కడ ఉన్న సంచార జాతులకు చెందిన తాత్కాలిక నివాసాలయిన ‘్ధక్స్’లలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇద్దరు మిలిటెంట్లు ఒకరు చలి కారణంగా, మరొకరు భద్రతా దళాల కాల్పుల్లో చనిపోగా, మిగతా వారికోసం ఇంకా వేట కొనసాగుతోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఆర్మీకి చెందిన ఒక కల్నల్ కూడా చనిపోయాడు. ఉగ్రవాదుల జాడ తెలసుకోవడం కోసం సైన్యం ద్రోణ్‌లు, ఇతర అత్యాధునిక పరికరాలను రంగంలోకి దించినప్పటికీ, దుర్గమదారుల ప్రాంతం కావడం అలాగే ఎత్తుగా పెరిగే ‘కానిఫర్’ వృక్షాలు ఎక్కువగా ఉండడం, సహజంగా ఏర్పడిన గుహలు మిలిటెంట్లు నక్కి ఉండి హటాత్తుగా దాడులు చేయడానికి వీలుగా ఉంటున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు కొంతమంది మిలిటెంట్లు లోలాబ్ లోయలోకి జారుకుని ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు అంటున్నాయి.