జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో నక్సల్స్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి/ భద్రాచలం, జనవరి 27: జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో బుధవారం సాయంత్రం నక్సలైట్లు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చడంతో కనీసం ఆరుగురు పోలీసులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. జిల్లాలోని చత్తర్‌పూర్ ఏరియాలో పోలీసు వాహనాన్ని టార్గెట్ చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చినట్టు తెలుస్తోంది. దాడిలో పోలీసు వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ సైతం మృతిచెందాడు. గాయపడిన భద్రతా సిబ్బందిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. మందుపాతర పేల్చిన తర్వాత మావోయిస్టులు పోలీసు బృందంపై కాల్పులకు దిగారు. కడపటి వార్తలు అందేసరికి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చత్తర్‌పూర్ గ్రామం వద్ద మావోయిస్టులు 12మంది పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్‌గా చేసుకున్నట్టు డిఎస్పీ ప్రభాత్ రంజన్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. పాలము డిఐజి సాకేత్ కుమార్ సింగ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హుటాహుటిన సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. నక్సల్స్‌కు నెలవైన ఈ ప్రాంతంలో దాడికి పాల్పడిన మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.
ఇదిలావుంటే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ ఐజీ కల్లూరి, దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపిన వివరాల ప్రకారం నిఘా వర్గాల సమాచారంతో కటేకల్యాణ్ పోలీసుస్టేషన్ నుంచి హెడ్‌కానిస్టేబుల్ భద్రు ఆధ్వర్యంలో బలగాలు లకాపాల్ - తరెంపారా గుట్టలపైకి చేరుకున్నారు. అక్కడ మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తుండగా పోలీసులు చుట్టుముట్టారు. అప్రమత్తమైన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. సుమారు గంటసేపు పరస్పర కాల్పుల అనంతరం మావోయిస్టులు అక్కడ నుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను కనుగొన్నారు. భారీగా డిటోనేటర్లు, 315 తయారీ తుపాకీ, బర్మా తుపాకులు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, నిత్యవసరాలు, మందులు లభ్యమయ్యాయి. లొంగిన నక్సల్స్ సహాయంతో మృతదేహాలను పరిశీలించగా కాంకేర్ ఎల్‌జీఎస్ డిప్యూటీ కమాండర్ బాల్‌సిన్హా అలియాస్ మాసాగా ఒకరిని గుర్తించారు. ఇతను దర్బా డివిజన్ కమిటీలో సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను హతమార్చిన జీరంఘాట్ ఘటనలో బాల్‌సిన్హా అలియాస్ మాసా, మృతిచెందిన మరో ఇద్దరు మావోయిస్టులు కీలకపాత్ర పోషించినట్లు లొంగిన నక్సల్స్ సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఇదిలావుండగా బైరంఘడ్ పోలీసుస్టేషన్‌కు సమీపంలో మంగల్‌నార్ పంచాయతీ అడవుల్లో మావోయిస్టులు రెండు టిప్పర్లు, ఒక జేసీబీని తగులబెట్టారు. పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.

చిత్రం... చత్తీస్‌గఢ్‌లో మృతి చెందిన మావోలు, లభ్యమైన ఆయుధాలు