జాతీయ వార్తలు

బాబ్రీ మసీదు స్థలంలో హిందూ ఆలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండిన స్థలంలో 1976-77 మధ్య కాలంలో అప్పటి భారత పురాతత్వ శాఖ (ఎఎస్‌ఐ) డైరెక్టర్ ప్రొఫెసర్ బిబి లాల్ నేతృత్వంలోని ఓ బృందం జరిపిన తవ్వకాల్లో ఒక హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు బైటపడ్డాయని అప్పుడు ఎఎస్‌ఐ ఉత్తరాది ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేసిన కెకె ముహమ్మద్ ఆరోపించారు. అంతేకాదు, బాబ్రీ బసీదు సమస్యకు ఓ సామరస్య పరిష్కారం లభించే అవకాశాలకు ఇర్ఫాన్ హబీమ్, రోమిల్లా థాపర్‌లాంటి వామపక్ష భావజాలం ఉన్న చరిత్రకారులు గండి కొట్టారని 3నాన్ ఎన్న భారతీయం2 (నేను నా భారతీయం) పేరుతో మలయాళంలో రాసుకున్న ఆత్మకథలో మహమ్మద్ ఆరోపించారని ఆన్‌లైన్ పత్రిక 3్ఫస్ట్‌పోస్ట్2 పేర్కొంది. 3 వామపక్ష చరిత్రకారులు జరిపిన బ్రెయిన్‌వాష్ ప్రభావానికి ముస్లిం మేధావులు గనుక లొంగిపోకుండా ఉండి ఉంటే బాబ్రీ మసీదు సమస్య ఎప్పుడో పరిష్కారం అయి ఉండేది. 19వ శతాబ్దానికి ముందు అక్కడ ఉండిన హిందూ ఆలయాన్ని కూల్చివేయడం గురించి ఎక్కడా ప్రస్తావన లేదని, అయోధ్య బౌద్ధుల, జైన్‌ల కేంద్రమని రోమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, ఎస్ గోపాల్ సహా కొంతమంది చరిత్రకారులు వాదించారు. ఇర్ఫాన్ హబీబ్, ఆర్‌ఎస్ శర్మ,డిఎన్ ఝా, సూరజ్ బెన్ అఖ్తర్ అలీలాంటి చరిత్రకారులు సైతం దీన్ని సమర్థించారు2 అని ముహమ్మద్ ఫస్ట్‌పోస్ట్‌కు చెప్పారు.
అంతేకాదు తవ్వకాల సమయంలో బయల్పడిన ఆలయ స్తంభాలను బట్టి బాబ్రీ మసీదు ఉండిన చోట ఒక హిందూ ఆలయం ఉండేదని స్పష్టం అవుతోందని కూడా ముహమ్మద్ వాదించారు. 3ఒకటి,రెండు కాదు..ఏకంగా 14 స్తంభాలను కనుగొన్నాం. 11, 12 శతాబ్దాలకు చెందిన ఆలయ స్తంభాలను పోలిసన ఈ స్తంభాలను బట్టి చూస్తే ఆలయం శిథిలాలపైన బాబ్రీ మసీదును కట్టారని స్పష్టమవుతోంది. ఈ విషయమై నేను అప్పట్లోనే చాలా ఇంగ్లీషు దినపత్రికలకు వ్యాసాలు పంపించాను. ఒక్క పత్రిక మాత్రమే అది కూడా 3లెటర్స్ టు ది ఎడిటర్2 కాలమ్‌లో నా అభిప్రాయాన్ని ప్రచురించింది2 అని ముహమ్మద్ ఆపుస్తకంలో రాశారు. వామపక్ష చరిత్రకారులు అలహాబాద్ హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించడమే కాకుండా చివరికి కుతుబ్ మినార్, తాజ్‌మహల్ సైతం హిందూ ఆలయాలపైన నిర్మించినవేనని అన్నారు. 2012లో ఎఎస్‌ఐలో రిటైరయిన తర్వాత ముహమ్మద్ హైదరాబాద్‌లోని ఆగాఖాన్ ట్రస్టు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.