అంతర్జాతీయం

అమెరికా అంతటా గణతంత్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 27: భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికా అంతటా ఘనంగా జరిగాయి. రాజధాని వాషింగ్టన్‌లోని ఎంబసీ వద్ద భారత రాయబారి అరుణ్ కె సింగ్ త్రివర్ణ పతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖ ఇండో అమెరికన్లు హాజరయ్యారు. నగరమంతా మంచుదుప్పటి పరచుకున్నా రిపబ్లిక్‌డే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత జాతీయ పతాకావిష్కరణకు ముందు ఎంబసీ ఎదుట ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగ పాఠాన్ని రాయబారి అరుణ్ కె సింగ్ చదివారు. అలాగే న్యూయార్క్, చికాగో, హ్యూస్టన్, అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కోలలో గణతంత్ర దినోత్సవ వేడుగులు నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో చికాగోలో రిపబ్లిక్‌డే వేడుకలు జరిగాయి. చికాగోలోని భారత చీఫ్ కాన్సులేట్ జనరల్ అసాఫ్ సరుూద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
హ్యూస్టన్‌లో కాన్సులేట్ జనరల్ పర్వతనేని హరీశ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. యువత భారత జాతీయ గీతాన్ని ఆలపించారు.