జాతీయ వార్తలు

కేరళ సిఎంకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 29: సౌర విద్యుత్ కుంభకోణంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ముఖ్యమంత్రితో పాటు విద్యుత్ మంత్రి ఆర్యదన్ మొహమ్మద్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ దాఖలుకు విజిలెన్స్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి చాందీ, విద్యు త్ మంత్రి మొహమ్మద్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి పి.అబేద్ వెల్లడించారు. తన అధికారాల పరిధిని, స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోకుండా విజిలెన్స్ కోర్టు వీరిద్దరిపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఆదేశించిందని హైకోర్టు న్యాయమూర్తి తన నిలిపివేత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు నెలల పాటు విజిలెన్స్ కోర్టు ఉత్తర్వులు అమలులోకి రాకుండా ఆదేశించిన హైకోర్టు విజిలెన్స్ కోర్టు న్యాయమూర్తిపై పాలనాపరమైన చర్యలను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది.
న్యాయమూర్తి వసన్
స్వచ్ఛంద పదవీవిరమణ!
సౌర విద్యుత్ కుంభకోణం కేసులో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించిన త్రిసూర్ విజిలెన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్ వసన్ స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊమెన్ చాందీ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్యదన్ మొహమ్మద్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కింది కోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలకే విచారణ కమిషనర్, త్రిసూర్ ప్రత్యేక న్యాయమూర్తి వసన్ స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సౌర విద్యుత్ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న కమిషన్ ముందు హాజరయిన నిందితురాలు సరితా నాయర్ తాను ముఖ్యమంత్రి చాందీ సన్నిహితునికి రూ. 1.90 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రి ఆర్యదన్ మొహమ్మద్‌కు రూ. 40 లక్షల లంచం ఇచ్చానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాము ఎలాంటి లంచం తీసుకోలేదని వారు ఇద్దరు ఖండించారు. తాను, బిజూ రాధాకృష్ణన్ (సహ నిందితుడు) కలిసి ఏర్పాటు చేసిన టీమ్ సోలార్ కంపనీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ ముడుపులు చెల్లించినట్లు సరితా నాయర్ చెప్పారు.

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ