జాతీయ వార్తలు

సబ్సిడీలు తొలగించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సబ్సిడీలను తొలగించాలన్న ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదన్నారు. వీటిని లక్ష్యిత వర్గాలకే ఉపయోగ పడేలా సహేతుక విధానాన్ని తీసుకొస్తామన్నారు. అనవసర నియంత్రణలు, వక్రీకరణలు తొలగిస్తామని తెలిపారు. వనరుల కేటాయింపులో సహేతుకత, పారదర్శకతను పెంపొందిస్తామని,దేశాభివృద్ధికి దోహదం చేసే విధంగా అవకాశాలను కల్పిస్తామన్నారు.సబ్సిడీలు అన్నీ మంచివేనని తాను చెప్పడం లేదని అయితే, ఇలాంటి అంశాలపై సైద్ధాంతిక వైఖరి అంటూ ఏమీ ఉండకూడదన్నదే తన వాదన అని పేర్కొన్నారు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించి నిర్హేతుకమైన సబ్సిడీలను తొలగించాలని తెలిపారు. పేదలు, అవసర వర్గాల అభ్యున్నతికి కొన్ని రకాల సబ్సిడీలు అవసరమేనన్నారు. సబ్సిడీలను గంపగుత్తగా తొలగించకుండా..వాటిని సహేతుకం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని శుక్రవారం నాడిక్కడ జరిగిన ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ శిఖరాగ్ర సదస్సులో తెలిపారు. పరిశ్రమలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తే..వాటిని ప్రోత్సాహకాలంటారని, అదే రైతులకు ఇస్తే సబ్సిడీలంటూ ముద్ర వేస్తారని ఆర్థికవేత్తలు, కార్పొరేట్ సంస్థల తీరును ప్రధాని మోదీ విమర్శించారు. భాషాపరంగా కనబరుస్తున్న ఈ వ్యత్యాసం మన ధోరణిలో మార్పునూ ప్రతిబింబిస్తోందా అని ప్రశ్నించారు. సంపన్న వర్గాలకు అందుతున్న సబ్సిడీలను సానుకూలమైనవిగా ఎందుకు పరిగణిస్తున్నారని ప్రశ్నించారు.కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు ఇస్తున్న రాయితీల వల్ల 62వేల కోట్ల రూపాయల మేర నష్టం వస్తోందని, పేదలకు ఎలాంటి ప్రయోజనం కలిగించక పోయినా పన్ను పరంగా వేలాది కోట్ల రూపాయల మేర రాయితీలూ అందిస్తున్నామన్నారు.