అంతర్జాతీయం

చంద్రుడు ఏర్పడిందిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, జనవరి 29: భూమి ఒక గ్రహంగా ఏర్పడిన దాదాపు పది కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, అప్పటికి ఇంకా ఒక పిండ రూపంలోనే ఉన్న ‘్థయా’ అనే మరో గ్రహం పరస్పరం ఎదురెదురుగా ఢీకొనడం కారణంగా చంద్రుడు ఏర్పడినట్లు తాజాగా జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 450 కోట్ల సంవత్సరాల క్రితం అత్యంత వేగంగా సంభవించిన ఈ ప్రమాదం గురించి శాస్తజ్ఞ్రులకు ఇదివరకే తెలిసినప్పటికీ భూమి థీయాను 45 డిగ్రీలు అంతకన్నా ఎక్కువ కోణంలో ఢీకొట్టిందని చాలామంది అనుకున్నారు. అయితే ఈ రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయనే వాదనను ఈ పరిశోధన బలపరుస్తోందని తాజా పరిశోధకులు అంటున్నారు.
చంద్రుడిపైకి అమెరికా జరిపిన అపోలో 12, 15, 17 యాత్రల్లో చం ద్రుడిపైనుంచి తీసుకువచ్చిన ఎనిమిది శిలలను, అలాగే భూమిపై అగ్ని పర్వతాల లావా వల్ల ఏర్పడిన ఆరు శిలలను లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్తజ్ఞ్రులు విశే్లషించారు. ఈ శిలల్లోని ఆక్సిజన్ అణువుల్లో ఉన్న రసాయనిక స్వరూపాలే శాస్తజ్ఞ్రులు అత్యంత శక్తివంతమైన ఈ పేలుడుకు సంబంధించి ఒక నిర్ధారణకు రావడానికి ప్రధాన కారణం. శిలల పరిమాణంలో 90 శాతం, వాటి బరువులో 50 శాతం ఆక్సిజనే ఉంటుంది. భూమిపై ఉండే ఆక్సిజన్‌లో 99.9 శాతానికి పైగా ‘ఓ-16’గానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి అణువులోను ఎనిమిది ప్రోటా న్లు, మరో ఎనిమిది న్యూట్రాన్లు ఉంటాయి. అయితే కొన్నింటిలో మాత్రం అరుదుగా ఒకటి, రెండు న్యూట్రాన్లు ఎక్కువగా ఉంటాయి. మన సౌర వ్యవస్థలోని భూమి, శుక్రుడు, ఇతర గ్రహాల్లోని వస్తువుల్లో చాలావరకు ఓ-17నుంచి ఓ-16 నిష్పత్తిలోనే ఉంటాయి. అంటే అవన్నీ కూడా దాదాపుగా అచ్చుగుద్దినట్లుగా ఒకే మాదిరిగా ఉంటాయి.
భూమి, చంద్రుడి ఐసోటోప్‌ల మధ్య తమకు ఎలాంటి తేడా కనిపించలేదని, అవి రెండూ కూడా తేడా గుర్తించలేనంతగా ఒకే మాదిరిగా ఉన్నాయని, ఈ పరిశోధనా పత్రం ప్రధాన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ అయిన ఎడ్వర్డ్ యంగ్ తెలిపారు. ఒక వేళ భూమి థీయాను గనుక ఒక వైపునుంచి ఢీకొని ఉండి ఉంటే చంద్రుడు థీయానుంచే ఏర్పడి ఉండేదని, అప్పుడు భూమి, చంద్రుడిలో భిన్నమైన ఆక్సిజన్ ఐసోటోప్‌లుండేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవి రెండూ కూడా ఎదురెదురుగా ఢీకొన్న కారణంగానే ఈ రెండింటిలోను ఒక రకమైన రసాయనాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా పిండం రూపంలో ఉండిన థీయా భూమి, చంద్రుడి మధ్య సమానంగా విడిపోయిందని, అందుకే భూమికి, చంద్రుడికి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ ఈ ప్రమాదమే సంభవించకుండా ఉండి ఉంటే థీయా ఒక గ్రహంగా మారి ఉండేదని కూడా ఆయన అన్నారు. ఈ పరిశోధనా పత్రం ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది.