జాతీయ వార్తలు

మోదీకి తప్పుడు సలహాలిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: బిజెపిలో అసమ్మతి ఎంపీగా ముద్రపడ్డ బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా మరోసారి మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వివాదం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున తీర్పు వెలువడే వరకూ ఆగి ఉండాల్సిందని 70ఏళ్ళ బిజెపి ఎంపీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ఇంత గొప్ప సలహాలు ఇస్తున్నది ఎవరోనంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని కాదని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం గొలుపుతోందని చెప్పారు. కోర్టు తీర్పు వెలువడేవరకూ వేచిచూస్తే కేంద్రం ఈ వివాదంలో చిక్కుకుని ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. పూణే నుంచి ఆయన ఒక వార్తా సంస్థతో ఫోన్‌లో మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్ర మోదీ మంచి ఆశయంతోనే పనిచేస్తున్నారు. ఆయనకు సలహాలు ఇస్తున్నవారితోనే అసలు సమస్య. మోదీకీ తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి వాటివల్ల ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు వస్తోంది’ అని పేర్కొన్నారు. ‘ఒక్కోసారి నా అభిప్రాయాలతో కొందరు ఏకీభవించకపోవచ్చు. అయితే బిజెపి, జాతికి మేలు జరగాలన్నదే నా ఉద్దేశం’ అని శతృఘ్నసిన్హా స్పష్టం చేశారు. తన నిజాయితీ, నిబద్ధత, ఆవేదనను పార్టీ అర్ధం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో డేషింగ్ హీరోగా వెలుగొందిన సిన్హా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.