అంతర్జాతీయం

మా సార్వభౌమత్వానికి సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 31: తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంలోని ఒక వివాదాస్పద దీవి సమీపానికి ఒక యుద్ధ నౌకను పంపిన అమెరికా చర్య బాధ్యతారహితమైనదని చైనా ఆదివారం తీవ్రంగా విమర్శించింది. అంతేకాదు అమెరికా ఉద్దేశపూర్వకంగా జరిపే రెచ్చగొట్టే చర్యలు ఈ ప్రాంత సుస్థిరతపై అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని కూడా హెచ్చరించింది. అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా చైనా సైన్యాలు దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాయని చైనా రక్షణ శాఖ ప్రతినిధి యాంగ్ యుజున్ స్పష్టం చేశారు. చైనా, తైవాన్, వియత్నాలు తమవిగా చెప్పుకొంటున్న జిషా దీవులలో (పారసెల్ దీవులు) భాగమైన ఝోంగ్‌జియాన్ దావో (ట్రిటాన్ దీవి)కి 12 నాటికల్ మైళ్ల దగ్గరిదాకా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అయిన అమెరికా యుద్ధ నౌక ‘యుఎస్‌ఎస్ కుర్టిస్ విల్‌బర్’ శనివారం ప్రయాణించిన కొద్దిగంటలకే యాంగ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా, ఇతర దేశాల హక్కులు, స్వేచ్ఛలను అడ్డుకుంటున్న చైనా మితిమీరిన సముద్ర జలాల హక్కులను సవాలు చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి కమాండర్ బిల్ అర్బన్ శనివారం వాషింగ్టన్‌లో స్పష్టం చేశారు.
అయితే అమెరికా చర్య ఇరుపక్షాల సైన్యాల భద్రతకు అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన చర్య అని, ఇది తీవ్ర ప్రమాదకరమైన పరిణామాలకు కారణమవుతుందని యంగ్ అన్నారు. పెట్రోలియం, సహజవాయు నిల్వలు పుష్కలంగా ఉండే దక్షిణ చైనా సముద్రంపై చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో సగం దాకా ఇండో-పసిఫిక్ మార్గం గుండానే వెళ్తుంటాయి. అయితే దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తుండగా, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనీలాంటి ఆ ప్రాంతంలోని దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, చైనా చట్టాలను గౌరవించాలని, వాటికి కట్టుబడి ఉండాలని, పరస్పర విశ్వాసం, ప్రాంతీయ శాంతి సుస్థిరతలను దెబ్బ తీయవద్దని చైనా విదేశాంగ శాఖ మరో ప్రకటనలో అమెరికాను కోరింది. ‘అమెరికా యుద్ధ నౌక చైనా చట్టాలను ఉల్లంఘించి చైనా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. చైనా బలగాలు గస్తీని నిర్వహించడమే కాకుండా అమెరికా యుద్ధ నౌకకు వౌఖిక హెచ్చరికలు చేసాయి’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు.