అంతర్జాతీయం

ఆగిన ‘పఠాన్‌కోట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఫిబ్రవరి 1: పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి విషయంలో పాకిస్తాన్ తన రెండు నాల్కల ధోరణిని మరోసారి చాటుకుంది. ఈ దాడికి కుట్ర పన్నిన వారిని శిక్షిస్తామంటూ దర్యాప్తు చేపట్టిన పాక్ ఇప్పుడు ‘మరిన్ని ఆధారాలు’కావాలంటూ భారత్‌కు స్పష్టం చేసింది. తాజా పరిణామంతో పఠాన్‌కోట్ దర్యాప్తు వ్యవహారం మొదటికొచ్చింది. ఇప్పటి వరకూ తమకు అందించిన ఆధారాలు ఎంత మాత్రం సరిపోవని, మరిన్ని సాక్ష్యాలను అందిస్తే తప్ప దర్యాప్తులో ముందుకెళ్లలేమని పాక్ తెగేసి చెప్పింది. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడమే కాకుండా వీటి వివరాలనూ బహిర్గతం చేస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ‘ఇప్పుడు వ్యవహారం భారత్ కోర్టులోనే ఉంది. మరిన్ని ఆధారాలు అందిస్తే తప్ప పఠాన్‌కోట్ దర్యాప్తులో ముందుకెళ్లలేం’అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఆరుగురు సభ్యులతో ఇప్పటికే పాక్ ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ‘్భరత్ నుంచి మరిన్ని కీలక ఆధారాలు కోరండి’అంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖకు వర్తమానం పంపింది. పఠాన్‌కోట్ నుంచి ఉగ్రవాదులు జరిపిన ఫోన్ కాల్స్ నెంబర్లను భారత్ అందించింది. వీటిపై పాక్ దర్యాప్తు బృందం దాదాపుగా దర్యాప్తు పూర్తి చేసింది. ఈ ఫోన్ నెంబర్ల రిజిస్టర్ కాలేదని, వారి వినియోగదారుల పేర్లూ నకిలీవేనని దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఇక్కడి నుంచి దర్యాప్తు ముందుకెళ్లాలంటే తదుపరి ఆధారాలను భారత్ అందించాల్సిందేనని పాక్ సీనియర్ అధికారి తెలిపారు.