జాతీయ వార్తలు

లంచమిచ్చినా.. తీసుకున్నా నేరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అవినీతిని పూర్తి స్థాయిలో కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లంచం తీసుకునే అధికారులకు విధించే గరిష్ఠ శిక్షాకాలాన్ని అయిదేళ్లనుంచి ఏడేళ్లకు పెంచడానికి ఉద్దేశించిన అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 1988 నాటి అవినీతి నిరోధక చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసినా లేదా సర్వీసునుంచి రిటైరయినా వారికి రక్షణ కల్పించడానికి కూడా ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించారు. లంచం ఇచ్చిన వ్యక్తికి, అలాగే లంచం తీసుకున్న వ్యక్తికి మరింత కఠిన శిక్షలను విధించడానికి వీలు కల్పించే ఈ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివ్గం గత ఏప్రిల్ 29న ఆమోదం తెలిపింది. కనీస శిక్షను ఆరు నెలలనుంచి మూడేళ్లకు, గరిష్ఠ శిక్షను అయిదేళ్లనుంచి ఏడేళ్లకు పెంచడానికి బిల్లులో చేసిన అధికారిక సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గరిష్ఠ శిక్షను ఏడేళ్లకు పెంచడం ద్వారా అవినీతిని తీవ్రమైన నేరాల కేటగిరీ కిందికి తెచ్చినట్లవుతుంది. అవినీతికి సంబంధించిన కేసుల విచారణను రెండేళ్ల లోగా పూర్తి చేయాలన్న నిబంధనను చేర్చడం ద్వారా ఈ కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేందుకు కూడా బిల్లులో వీలు కల్పించారు. అంతేకాదు ఆస్తుల జప్తు అధికారాలను జిల్లా కోర్టుకు కాకుండా ట్రయల్ కోర్టుకు (ప్రత్యేక జడ్జి) దఖలుపర్చడానికి కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రాసిక్యూషన్ కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రక్షణ నిబంధనను రిటైర్మెంట్, లేదా రాజీనామా చేయడం లాంటి కారణాల వల్ల ఉద్యోగం వదిలిపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడానికి బిల్లులో సవరణలను ప్రతిపాదించారు.