జాతీయ వార్తలు

కలిసి పనిచేస్తేనే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: విద్వేష సంఘటన ఎక్కడ జరిగినా అది సమాజానికే కాకుండా దేశానికే మాయని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి ఘటనలకు గురయ్యే వారి బాధ మొత్తం దేశానిదేనని స్పష్టం చేసిన ప్రధాని సమైక్యత, సామరస్యంతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిస్కారంలో పాలక ప్రతిపక్షాల మధ్య విభేదాలు సహజమైనట్లే పార్లమెంట్ ఉభయ సభలు సమైక్యంతో పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత దేశం భిన్నత్వంలోఏకత్వ సిద్ధాంతంపై అనేక అటుపోట్లను తట్డుకుని నిలబడిందని రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన రెండురోజుల ప్రత్యేక చర్చకు సమాధానంగా చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం లభించి రాజ్యాంగం రూపురేఖలు దిద్దుకున్న తరువాత అసలు మనం స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోగలుగుతామా? బండి నడుస్తుందా అన్న అనుమానాలు తతెత్తాయని గుర్తు చేశారు. గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, వల్లభాయి పటేల్, వౌలానా అజాద్ వంటి ఉద్దండులు దూరదృస్టితో వ్యవహరించి రూపొందించిన రాజ్యాంగం ఇప్పటికీ ఎప్పటికీ మార్గదర్శిగానిలబడి తీరుతుందని ప్రధాని చెప్పారు. ఒక సభ ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలను సరిదిద్ది సక్రమబాటలో దేశాన్ని నడిపించటానికి రాజ్యసభ అవసరాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే గ్రహించటం వారి విజ్ఞతకు నిదర్శనమని మోదీ చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యసభకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు
రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. భారత రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియకు ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్ట స్థానం ఉందన్నారు. రాజ్యాంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టరాదని ఉద్ఘాటించారు. స్వతంత్య్ర భారతంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకు మనకు మనమే బాధ్యత జవాబుదారి వహించాలే తప్పించి ఇందుకు ఆంగ్లేయ పాలకుల్ని అర్థరహితమంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ప్రధాని తెలిపారు. మన దేశంలో యువశక్తికి లోటులేదని, నిర్మాణాత్మక శక్తిగా మారటానికి పుష్కలంగా అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మనం వెనుకబడి పోతామనో లేక ఇతర దేశాలతో పోటీ పడలేమనో భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని చెప్పారు. మన దేశ పౌరులు తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరం లేదంటూ సమత మమత సంస్కారం ప్రతి ఒక్కరిలో పెరగాలని మోదీ పిలుపునిచ్చారు