అంతర్జాతీయం

కాశ్మీరులో ఉగ్రవాదుల భరతం పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 2: కాశ్మీరులో ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడం మానుకుని అక్కడ దాడులకు తెగబడుతున్న మూకలపై చర్యలు చేపట్టాలని, తద్వారా అంతర్జాతీయ సమాజంలో భయాందోళనలను తొలగించాలని పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) ప్రభుత్వానికి సూచించింది.
విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పాక్ పార్లమెంటరీ స్థారుూ సంఘం కాశ్మీరుకు సంబంధించి సోమవారం నాలుగు పేజీల విధాన పత్రాన్ని జారీ చేసిందని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల మెరుగుదలకు ఈ కమిటీ విధానపరమైన పలు సిఫారసులు చేసింది. ‘కాశ్మీరులోని నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు, ఇతర సాయుధ గ్రూపులకు పాకిస్తాన్ మద్దతునివ్వరాదు’ అని పిఎంఎల్-ఎన్ ఎంపీ అవాయిస్ అహ్మద్ లెఘారీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థారుూ సంఘం స్పష్టం చేసింది.
కాశ్మీరులో దాడులకు తెగబడుతున్న ఉగ్రమూకలపై పాక్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, కనుక కాశీరులో హింసాకాండకు తెగబడుతున్న సాయుధ గ్రూపులపై పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రపంచ దేశాల భయాందోళనలను తొలగించాలని ఈ కమిటీ పేర్కొంది. భారత్ విషయంలో పాక్ అనుసరించే విధానం ఇచ్చిపుచ్చుకోవడం, ఘర్షణలను తగ్గించుకోవడం, శాంతిని పునరుద్ధరించడం, ఫలితాలు సాధించడం అనే నాలుగు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉండాలని, దీర్ఘ కాలికంగా నలుగుతున్న అన్ని సమస్యలపై భారత్‌తో పాక్ ప్రభుత్వం నిరంతరం విస్తృత సంప్రదింపులను కొనసాగించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.