జాతీయ వార్తలు

ఇకపై యజమానుల ధ్రువీకరణ లేకుండానే పిఎఫ్ విత్‌డ్రా పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఇకపై ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్‌లను యాజమాన్యాల ధ్రువీకరణ లేకుండానే పరిష్కరించుకోవచ్చు. ఇపిఎఫ్‌ఓ చందాదారులు తమ దరఖాస్తులను యజమాని ధ్రువీకరణ లేకుండానే దాఖలు చేసుకోవడానికి ఇపిఎఫ్‌ఓ సంస్థ మంగళవారం అనుమతించింది. ఇప్పటివరకు పిఎఫ్ చందాదారులు తమ పిఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన క్లెయిమ్‌లను ప్రస్తుత లేదా మాజీ యజమానుల ద్వారా స్వయంగా సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ అవసరం లేదు. యూనివర్సల్ (లేదా పోర్టబుల్ పిఎఫ్) అకౌంట్ నంబరు(యుఎఎన్) యాక్టివేట్ అయిన బ్యాంక్ ఖాతా నంబరు, ఆధార్ నంబరు లాంటి కెవైసి వివరాలన్నీ నమోదుచేసిన ఖాతాదారులందరికీ ఈ కొత్త సదుపాయం వర్తిస్తుంది.
‘ఇపిఎఫ్‌ఓకు నేరుగా విత్‌డ్రాయల్ క్లెయిమ్‌లు దాఖలు చేసే సదుపాయంతో చివరగా ఆన్‌లైన్‌ద్వారానే ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోగానే ఆన్‌లైన్ ద్వారా పిఎఫ్ విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించగలమని ఆశిస్తున్నాం’ అని ఇపిఎఫ్‌ఓ కేంద్రీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కెకె జలాన్ పిటిఐతో అన్నారు. ‘తమ యుఎఎన్ నంబర్‌కు ఆధార్ నంబరు, బ్యాంక్ కాతా నంబరు లాంటివి అనుసంధానం చేసిన, వారి యుఎఎన్ నంబర్ యాక్టివేట్ అయిన ఉద్యోగులందరు కూడా తమ క్లెయిమ్‌లను ఫామ్-19, ఫామ్-ఐఓసి, ఫామ్-31ల ద్వారా సత్వర పరిష్కారం కోసం తమ యజమానుల ధ్రువీకరణ లేకుండానే సమర్పించుకోవచ్చు.
ఈ ఆదేశం తక్షణం అమలులోకి తీసుకు రావడం జరిగింది’ అని ఇపిఎఫ్‌ఓ కార్యాలయం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. యజమానుల ధ్రువీకరణ లేకుండా దరఖాస్తులు సమర్పించే చందాదారులు కొత్త 19 యుఎఎన్, 10-సి యుఎఎన్, 31 యుఎఎన్ ఫారాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిఎఫ్ విత్‌డ్రా కోసం మూడు పేజిల దరఖాస్తు ఫారం ఉంటే ఈ కొత్త ఫారాలు అరపేజి సైజులోనే ఉంటాయి.