జాతీయ వార్తలు

ఇక ఏటా 50వేల అంగన్‌వాడీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను సత్వరం అందించేందుకు వీలుగా ప్రతి ఏటా 50వేల అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ వెల్లడించారు. వీటి నిర్మాణానికి అవసరమైన నిధులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి కొంత, ఐసిడిఎస్ బడ్జెట్‌నుంచి మరికొంత కేటాయించడం జరుగుతుందన్నారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అంగన్‌వాడీ వర్కర్లకు జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మేనకాగాంధీ ప్రసంగిస్తూ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం వల్ల కార్యకర్తలందరికీ ఒకచోట కూర్చునే వెసులుబాటు దొరుకుతుందని చెప్పారు. శిశు కేంద్రాలను ఏర్పాటుచేసుకుని వారికి పోషకాహారం అందించే అవకాశం ఉంటుందన్నారు.
సొంత భవనాలు లేక అంగన్‌వాడీ కార్యకర్తలు అనేక అవస్థలు పడుతున్నారని నాకు తెలుసని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13.4 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని, వీటిల్లో రెండులక్షల కేంద్రాలకు సొంత భవనాలు లేవన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 రాష్ట్రాల్లో 50వేల అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం ఎక్కువగా ఉందని, ఈ రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన కార్యకర్తలకు, డిగ్రీ విద్యార్హత కలిగిన వారికి సూపర్‌వైజర్ ప్రమోషన్లలో 25శాతం రిజిర్వు చేస్తామని ప్రకటించారు.

బల్గేరియా కార్మిక
సదస్సుకు దత్తాత్రేయ

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఆసియా, ఐరోపా దేశాల కార్మిక శాఖల మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం రాత్రి బల్గేరియా వెళ్లారు. బల్గేరియాలోని సోఫియా నగరంలో మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవలసిన చర్యలు, ఉపాధి కల్పన, కార్మిక రంగంలో చేపట్టవలసిన సంస్కరణలు తదితర అంశాలపై మూడు రోజుల సమావేశంలో సమాలోచనలు జరుగుతాయని బండారు దత్తాత్రేయ తెలిపారు. డిసెంబర్ మూడో తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరిగే ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు అనుసరించవలసిన విధానాలు, సంబంధిత అంశాలపై లోతుగా చర్చలు జరిపి తగు నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వివరించారు. సోఫియా సమావేశంలో ఆమోదించే తీర్మానాల ఆధారంగా భారత కార్మిక రంగంకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని బండారు పేర్కొన్నారు.