అంతర్జాతీయం

సూకీకి లైన్ క్లియర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెపిట్వా, ఫిబ్రవరి 8: నేషనల్ లీగ్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ మైన్మార్ అధ్యక్షపీఠం అధిరోహించడానికి మార్గం సుగమం అవుతోంది. సూకీ అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు రాజ్యాంగపరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయని ప్రభుత్వం అనుకూల వార్తా చానళ్లు వెల్లడించాయి. మైన్మార్ మిలటరీ చీఫ్‌తో జరిగిన చర్చలు సూకీకి సానుకూలంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. గత నవంబర్ 8న జరిగిన మైన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి అనూహ్య విజయం సాధించింది. అయితే సూకీ దేశాధ్యక్ష పదవి చేపట్టడానికి రాజ్యాంగంలోని 59(ఎఫ్) ఆధికరణ అవరోధంగా మారింది. 59(ఎఫ్) కింద విదేశీయులను పెళ్లాడితే అధ్యక్ష పదవికి అనర్హులు. సూకీ భర్త బ్రిటిష్ పౌరుడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అధ్యక్ష పదవి కైవసానికి సంబంధించి ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చినట్టు స్కైనెట్, మైన్మార్ నేషనల్ టెలివిజన్ ప్రకటించాయి. ఆర్టికల్-ఎ(ఎఫ్) రద్దుకు సంబంధించి ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఆర్మీ చీఫ్ అలాగే సూకీ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
పార్లమెంటులో మూడింట రెండో వంతు సభ్యులు ఆమోదంతోనే 59(ఎఫ్) ఆర్టికల్ తొలగించడానికి వీలుంది. పార్లమెంటులో సైన్యానికి 25 శాతం మంది సభ్యులను నామినేట్ చేయడానికి అవకాశం ఉన్నందున ఆర్టికల్ 59(ఎఫ్) రద్దుచేయడం ఒక్క సూకీ పార్టీవల్లే కాదు. ‘చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయి. సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నాం’ అని ఎన్‌ఎల్‌డి కేంద్ర కమిటీ సభ్యుడు క్వావ్ హెవే అన్నారు. హెవే పార్లమెంటు సభ్యుడు కూడా. ‘మా పార్టీ అధినేత్రి సూకీకి అధ్యక్ష పీఠం ఎంతో దూరంలో లేదు. త్వరలోనే సాకారమవుతుంది’ అని ఆయన ప్రకటించారు. ‘59(ఎఫ్)కి సంబంధించి రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అయితే వీటికి సంబంధించి వార్తా చానళ్లలో వస్తున్న కథనాలపై ఇప్పటికిప్పుడు స్పందించబోం’ అని ఆయన స్పష్టం చేశారు.